MoviesMaa Elections: మరో బిగ్ బాంబ్ పేల్చిన ప్రకాష్ రాజ్..!!

Maa Elections: మరో బిగ్ బాంబ్ పేల్చిన ప్రకాష్ రాజ్..!!

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో ప్రకాష్ రజ్ అతి దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే . తెలుగు చిత్రసీమకు సంబంధించి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించడమే కాదు.. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. దీంతో మంచు ఫ్యామిలీ..ఆయనకు సపోర్ట్ చేసిన సినీ సెలబ్రీటీస్ సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే, ఎవరు ఊహిచని విధంగా ప్రకాష్ రా మా సభ్యత్వానికి రాజీనామా చేసారు. నేను తెలుగు వాడిని కాకపోవడం నా తప్పు కాదు అంటూ రాజీనామా చేసేసారు. అయితే మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచి విష్ణు మాత్రం ..ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ఎన్నికల టైంలో ఎన్నో అనుకుంటాం..అవన్నీ అక్కడితోనే మర్చిపోవాలి..మీరు పెద్దవారు..మీ సజీషన్స్ నాకు చాలా ముఖ్యం..ఈ విషయమై త్వరలోనే మిమ్మలని డైరెక్టుగా కలిసి మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు.

అయితే తాజా ప్రకాష్ రాజ్ మరో బిగ్ బాంబ్ పేల్చారు. ట్వీట్టర్ వేదికగా..‘మాకు మద్దతుగా నిలిచిన ‘మా’ సభ్యులకు నమస్కారం. నేను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా’ అని నటుడు ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ప్రకాష్ రాజ్ ని ఎవరైనా బలవంతంగా రాజీనామా చేయమని చెప్పారా అనే డౌట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news