ఎస్ ఇది నిజమే ? అన్న చర్చలే ఇప్పుడు మా ఫలితాల తర్వాత వినిపిస్తున్నాయి. జీవిత రాజశేఖర్ దంపతులకు మెగా ఫ్యామిలీకి ముందు నుంచి ఏదో ఒక విషయంలో మనస్పర్థలు ఉంటూనే వస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జీవిత దంపతులు చిరంజీపై విమర్శలు చేయడం.. తర్వాత మెగా అభిమానులు రైల్లో వీరిపై దాడి చేయడం .. ఇలా చాలా విషయాలే జరిగాయి. తర్వాత కూడా జీవితా రాజశేఖర్ దంపతులకు మెగా ఫ్యామిలీకి అంత సఖ్యత అయితే లేదు.
ఇక ఎన్నికలకు ముందు కూడా ఆమె ముందుగా తాను సొంతంగా మా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటున్నానని చెప్పింది. తర్వాత ప్రకాష్‌రాజ్ మాట్లాడడంతో ఆమె జనరల్ సెక్రటరీ పదవి కోసం చివరకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్ నుంచే పోటీ చేసింది. అయితే ఆమె ప్రకాష్ ఫ్యానెల్లోకి రావడం చాలా మంది మెగా అభిమానులను హర్ట్ చేసింది. ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరకు మెగా కాంపౌండ్ భక్తుడు బండ్ల గణేష్ అయితే అప్పటి వరకు అదే ఫ్యానెల్ నుంచిబయటకు వచ్చి.. జీవితపై తిరుగుబావుటా ఎగరవేసి ఆమె మీదే జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటన చేశారు.
చివరకు నాగబాబు లాంటి వాళ్లు మాట్లాడడంతో బండ్ల తాను పోటీ నుంచి తప్పుకుని ప్రకాష్‌రాజ్‌కు సపోర్ట్ చేశారు. అయితే జీవిత ఓడిపోవాలనే బండ్లతో పాటు మాలో ఉన్న చాలా మంది మెగా సపోర్టర్స్ ముందు నుంచే వారి ప్రయత్నం వారు చేశారు. ఇంకా చెప్పాలంటే ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్లో ఉన్న వారిలోనే చాలా మంది జీవితకు ఓట్లేయలేదని అంటున్నారు. ఇన్ని జరిగినా కూడా జీవితపై పోటీ చేసిన రఘుబాబు కేవలం 7 స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు.
ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ వల్లే జీవిత ఓడిపోయిందన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. చిరంజీవి కుటుంబం నుంచి అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్ లాంటి వంటి వాళ్లు కనీసం 8 మంది వచ్చినా ఆమె గెలిచేదని అంటున్నారు. మరి ఇది కూడా నిజమే కదా ?