Moviesకొంప ముంచిన "మా" ఎన్నికలు..ప్రకాష్ రాజ్ షాకింగ్ డెసిషన్..!!

కొంప ముంచిన “మా” ఎన్నికలు..ప్రకాష్ రాజ్ షాకింగ్ డెసిషన్..!!

దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికల హడావిడికి ఆదివారం తెరపడింది . తెలుగు చిత్రసీమకు సంబంధించి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు.

తాజాగా ప్రకాష్ రాజ్.. మా ఎన్నికలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా ఎన్నికైనా మంచు విష్ణు.. అతని ప్యానల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను తెలుగువాడిని కాదు ఒప్పుకుంటాను. నేను టాలీవుడ్ లోకి అతిధిగా వచ్చాను.. అతిధిగానే ఉంటానని..అందుకే నేను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని. ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. తాను అసోసియేషన్ నుంచి మాత్రమే బయటికి వచ్చానని.. తనని తెలుగు సినిమాలో నటించవద్దని చెప్పే హక్కు ఎవరికి లేదని.. యధావిధిగా తెలుగు సినిమాల్లో నటిస్తానని క్లారిటీ ఇచ్చారు..

ఇక.. మెగా బ్రదర్‌ నాగ బాబు కూడా మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వీహయం తెలిసిందే. మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు అని తెలిసిన కొద్ది సేప్పటికే ఆయన ఇలా మా ప్రాధమిక సభ్యత్వానికి రాజినామ చేయడం సంచలనంగా మారింది.ఇక తాజాగా జరిగిన మా ఎన్నికల్లో నాగబాబు ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌కి సపోర్ట్ చేసారు..ఆయన గోర ఓటమి పాలైయ్యారు. అయితే ఇలా మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్..నాగబాబు రాజీనామా చేయడం చర్చ్నీయాంశంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news