Moviesబ్రేకింగ్‌: కాబోయే భ‌ర్త‌ను రివీల్ చేసిన ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌... ఆ నిర్మాతే..

బ్రేకింగ్‌: కాబోయే భ‌ర్త‌ను రివీల్ చేసిన ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌… ఆ నిర్మాతే..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఈ రోజు త‌న అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పేసింది. టాలీవుడ్‌ను ఏడెనిమిది ఏళ్ల క్రితం ఓ ఊపు ఊపేసింది ర‌కుల్‌. వ‌రుస పెట్టి స్టార్ హీరోలు అంద‌రితో న‌టించ‌డంతో పాటు అంద‌రితోనూ హిట్ సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత ఆమె హైద‌రాబాద్‌లోనే ఉంటూ ఇక్క‌డ కొన్ని బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేసింది. అటు త‌మ్ముడితోనూ బిజినెస్‌లు పెట్టించింది.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌లో మంచి సినిమాలు చేసిన ర‌కుల్ బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా తెలుగులో ఆమె న‌టించిన కొండ‌పొలం సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ర‌కుల్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌ల‌కు ప్ర‌శంస‌లు కూడా ద‌క్కుతున్నాయి.

ఇదిలా ఉంటే ర‌కుల్ త‌న ఇన్‌స్టాలో తాను బాలీవుడ్ న‌టుడు, నిర్మాత జాకీ భ‌గ్నానీని ప్రేమిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. అత‌డితో దిగిన ఫోటోను పంచుకోవ‌డంతో పాటు థ్యాంక్యు మై ల‌వ్‌. ఈ సంవ‌త్స‌రం నేను అందుకున్న అతిపెద్ద బ‌హుమ‌తి నువ్వే అని చెప్పింది. నా జీవితంతో రంగులు నింప‌డంతో పాటు న‌న్ను ఆనంద ప‌రుస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు అని చెప్పింది. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news