మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రెండు నెలలుగా పెద్ద యుద్ధానే తలపించాయి. ఆదివారం జరుగుతున్న ఎన్నికల్లో సాయంత్రానికి ఎవరు కొత్త మా అధ్యక్షుడు అవుతారో ? ఏ ఫ్యానెల్ నుంచి ఎవరు ? విజయం సాధిస్తారో ? తేలిపోనుంది. ఎన్నడూ లేనంతగా ఈ సారి మా ఎన్నికల్లో ఓటుకు నోట్ల కట్టలే తెగాయి. ముందుగా రు. 10 వేలు ఇవ్వాలని అనుకున్నారు. చివరకు ఇది మరింత ప్రెస్టేజ్‌గా మారడంతో శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు ఒక్కో ఓటుకు ఇది ఏకంగా రు. 25 వేల వరకు వెళ్లింది.
ఇక ఎవరికి వారు తమ ప్రత్యర్థి ఫ్యానెల్ వాళ్లు భారీగా డబ్బులు పంచుతున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ముందుగా నరేష్ ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్ గెలిచేందుకు భారీ ఎత్తున డబ్బులు పంచుతోందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిని శ్రీకాంత్ ఖండించాడు. నరేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దసరా టైంలో తాము తప్పు చేస్తే అమ్మవారు తమను తప్పకుండా శిక్షిస్తుందని వాపోయాడు.
నరేష్ మా ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని.. డబ్బులు పంచుతుంది మీరే అంటూ శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. నరేష్ వల్లే డబ్బులు మొత్తం పోయాయన్నాడు. ఇక నరేష్ కూడా ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ వాళ్లు డబ్బులు పంచుతున్నారని… మూడు, నాలుగు సెంటర్లలో డబ్బులు పంచడం మా దృష్టికి వచ్చిందని ఆరోపించారు. మ్యానిఫెస్టో రిలీజ్ చేయకుండా డబ్బే గెలిపిస్తుందని.. నెంబర్లను లోబరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు మండిపడ్డారు. ఎవ్వరూ కూడా డబ్బులు తీసుకోకుండా మీ మనసాక్షికే ఓటేయాలని పిలుపు ఇచ్చారు.
ఇక నోట్ల పంపిణీలో రెండు ఫ్యానెల్స్ పోటీ పడినట్టు తెలుస్తోంది. కొందరికి రు. 10 వేలు ఇస్తే.. మరి కొందరికి రు. 15 వేలు నుంచి రు. 25 వేల వరకు పంచినట్టు టాక్ వినిపిస్తోంది.