Gossipsటాలీవుడ్‌లో మ‌రో హీరో కూడా భార్య‌కు దూరం దూరంగానే ..?

టాలీవుడ్‌లో మ‌రో హీరో కూడా భార్య‌కు దూరం దూరంగానే ..?

సినిమా ఇండ‌స్ట్రీలో ఇటీవ‌ల వివాదాలు లేని జంట‌ల‌ను త‌క్కువుగా చూస్తున్నాం. అంతెందుకు నిన్న‌టి వ‌ర‌కు ఎంతో అన్యోన్యంగా ఉండి రొమాంటిక్ క‌ఫుల్‌గా పేరు తెచ్చుకున్న వారు కూడా రేపు విడిపోయి షాక్ ఇస్తున్నారు. నాగ‌చైత‌న్య – స‌మంతే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. జూలై వ‌రకు వీరు ఎంతో అన్యోన్యంగానే ఉన్నార‌న్న‌ది తెలిసిందే. వీరి మ‌ధ్య ఆగ‌స్టులోనే ఏదో గ్యాప్ స్టార్ట్ చివ‌ర‌కు వీరు విడిపోయే వ‌ర‌కు వెళ్లిపోయింద‌నే ఇండ‌స్ట్రీలో ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు.

ఇక ఇప్పుడు ఈ లిస్టులోనే మ‌రో టాలీవుడ్ యంగ్ హీరో కూడా చేరిన‌ట్టు భోగ‌ట్టా ? పెద్ద‌గా ఇండ‌స్ట్రీలో గుర్తింపు లేని ఓ యంగ్ హీరో ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తున్న్ఆడు. ఆ హీరోకు ఇప్పుడు భార్య‌తో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ గొడ‌వ‌లో ఎవ‌రిది త‌ప్పు ? ఏం జ‌రిగింది ? అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు కాని.. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

హీరోకు ఇండ‌స్ట్రీలో మ‌రీ అంత ఐడెంటిటీ లేక‌పోయినా.. భార్య కాస్త పెద్ద ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన అమ్మాయి కావ‌డంతో ఈ వ్య‌వ‌హారంలో ఎవ్వ‌రూ రాజీకి రావ‌డం లేద‌ట‌. ఇక ఆ హీరో న‌టిస్తోన్న రెండు సినిమాలు ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్‌లో ఉన్నాయి. ఈ గొడ‌వ‌ల కార‌ణంగానే ఆ రెండు సినిమాల షూటింగ్ బాగా స్లో గా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక కొంత కాలంగా ఈ హీరో బ‌య‌ట క‌నిపించ‌డ‌మే మానేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news