మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్కంఠ పెరుగుతుంది. అధ్యక్ష పదవి కోసం హీరో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. తెర పై నటించే ఈ నటీ నటీమణులు తెర వెనుక కూడా నటిస్తారా అన్నడు రచ్చ రంబోలా గా మారుస్తున్నారు. అవసరం ఉన్న లేకున్నా ప్రెస్ మీట్ లు పెట్టి.. ఎదుట వారిని తిట్టిపోస్తున్నారు. ఇదంతా చూస్తుంటే..అసలు రాజకీయ నాయకులు వీళ్ళ ముందర సరిపోతారా అన్నట్లు ఉంది.
అక్టోబర్ 10 న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పోటీ ప్రకాష్ రాజ్ ..మంచి విష్ణు ల మధ్య సాగుతుంది. ఇప్పటికే ఈ ఇద్దరు తమ ప్యానల్స్‌తో ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్యానల్ మెంబర్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఫైర్ అవుతుండటం చూస్తున్నాం.
ఇక సిని’మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు నటుడు మంచు విష్ణు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వరుస ఇంటర్వ్యూలతో ప్రత్యర్థి ప్యానెల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ముఖ్యంగా ప్రకాశ్‌రాజ్ పై సంచలన వ్యాఖ్యలతో విష్ణు కౌంటర్ ఇచ్చారు. విష్ణు మాట్లాడుతూ..”మా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అతడు..ఆయ్న పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ వ్యతి నా ఫ్యామిలీపై ఎన్నో దారుణమైనఆరోపణలు చేసాడు.
అసలు ఆయన ఇక్కడివాడు కాదు. కాబట్టి అతడికి నా ఫ్యామిలీ గురించి..నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌడ్ గురించి ఏమీ తెలీయకపోవచ్చు.. అందుకే, క్షమించి వదిలేసా. కానీ ఇప్పుడు అలా కాదు. ఛాలెంజ్ చేసి మరీ చేప్తున్నా.. దమ్ముంటే .. ఆయనకి అసలు దమ్ముంటే..ఇప్పుడు రమ్మనండి..వచ్చి నా ఫ్యామిలీపై కామెంట్స్ చేయమనండి. అప్పుడు చూపిస్తా నేనేంటో..నా రేంజ్ ఏంటో” అంటూ విష్ణు ఆవేశంతో సవాల్ విసిరారు. తన ఫ్యామిలీపై ఎవరైనా కామెంట్లు చేస్తే జీవితంలో క్షమించనని హెచ్చరించారు.