Moviesఆ ఒక్క నెలలోనే సమంత చైతన్య ల జీవితాలు తలకిందులైయాయి..అసలు ఏం...

ఆ ఒక్క నెలలోనే సమంత చైతన్య ల జీవితాలు తలకిందులైయాయి..అసలు ఏం జరిగిందంటే..??

గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత, నాగ చైతన్య పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. విడాకులకు ముందు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సమంత-చైతన్య మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకు విడిపోతున్నారనే క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతూనే ఉంది. విడాకుల తర్వాత విడాకులకు కారణం ఇదే.. అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇలా విడాకుల అధికారిక ప్రకటన తర్వాత సమంత, నాగ చైతన్య పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి.

ఈ క్రమంలో శాకుతంలం చిత్ర నిర్మాత నీలిమ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. నీలిమ ఏమందంటే….”శాకుంతలం సినిమా కోసం మా నాన్న గుణశేఖర్ సమంతను కలిసినప్పుడు… సమంత అప్పటికే సినిమాలు ఆపేయాలని ఫిక్స్‌ అయిందట. ఎందుకంటే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నామని..సో బ్రేక్ తీసుకోవాలని అనుకున్నామని చెప్పింది. అయితే శాకుంతలం సినిమా కథ బాగా నచ్చడంతో..సినిమాని వదులుకోలేక.. జూలై నాటికి షూటింగ్ పూర్తిచేయాలని కండిషన్స్ పెట్టి డేట్స్ సర్ధుబాటు చేసింది.

ఆమె అనుకున్నట్లే అంతా హ్యాపీగా అయిపోయింది. కానీ ఏమైందో ఏమో సడెన్ గా సామ్ ఇంతలో విడాకుల తీసుకోవడం చూసి షాక్ అయ్యాం. జూలై వరకూ అంతా పరిస్ధితులు సక్రమంగానే ఉనాయి. కేవలం ఆగస్టు నెలలోనే ఏదో జరిగింది అందుకే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ కొత్త బాబ్ పెల్చింది. ఈ ప్రకటన తో ఇంత వరకు సమంతను తిట్టుకున్న వారంతా..ఒక్కసారిగా అక్కినేని ఫ్యామిలీ పై విరుచుకుపడుతున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎంత వర్కు పోతుందో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news