తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ( మా ) ఎన్నికలు మంచి రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన జరుగుతున్న ఎన్నికలలో అటు ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్, ఇటు మంచు విష్ణు ఫ్యానెల్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ప్రచార పర్వంలో విమర్శలు హద్దులు దాటేసి చివరకు వ్యక్తిగతంగా విమర్శించుకునే వరకు వెళ్లింది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే.
ప్రకాష్ రాజ్, మంచు మనోజ్‌తోపాటు వారి ప్యానల్‌లో ఉన్న సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ.. ఎన్నడూ లేని విధంగా వీధిన పడ్డారు. పరస్పర ఆరోపణలతో రాజకీయ నేతల్లా తిట్టుకొనే స్థాయికి దిగజారాయి ‘మా’ ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ నెలకొంది.
ఇంకా కేవలం ఒక్కరోజు మా ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో మా’ అధ్యక్ష పోటీకి నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న నటుడు సీవీఎల్ నరసింహరావు. ‘మా’ ఎన్నికలు అనే పరీక్ష రాయకముందే ఫెయిల్ అయ్యానని అన్న ఆయన.. కచ్చితంగా ఈ ఎన్నికలు హాయిగా ముందుకు సాగుతాయిని భావిస్తున్నాను అని.. ఒకవేళ అలా జరగకపోతే ‘మా’కి రాజీనామా చేస్తా..అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇలాంటి గందరగోళ, దరిద్రమైన పరిస్థితులకి నేనూ దోహదం చేశాను కాబట్టి ఇకపై ఓటు వేయను. బురదలో ఉన్నా వికసించడానికి నేను కమలాన్ని కాదు అంటూ ఘాటుగా స్పందించారు సీవీఎల్ నరసింహరావు.