Moviesనాడు నంద‌మూరి అవార్డులు... ' మెగా ' గొప్ప‌లు.. ఇప్పుడు '...

నాడు నంద‌మూరి అవార్డులు… ‘ మెగా ‘ గొప్ప‌లు.. ఇప్పుడు ‘ మెగా ‘ తిప్ప‌లు…!

ఎవ‌రేమ‌నుకున్నా ఏపీ సీఎం జ‌గ‌న్ టాలీవుడ్‌ను ముప్పు తిప్ప‌లు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించేస్తున్నారు. అయితే ఇక్క‌డే చాలా మంది జ‌గ‌న్ టార్గెట్ సినిమా ఇండ‌స్ట్రీ కాద‌ని.. మెగా ఫ్యామిలీయే అని అర్థ‌మ‌వుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన – టీడీపీ క‌లిస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుంద‌ని.. అందుకే ప‌వ‌న్‌ను ఇప్ప‌టి నుంచే కంట్రోల్ చేయాల్సిందే అని వైసీపీలోనే కొంద‌రు ఇచ్చిన డైరెక్ష‌న్ మేర‌కే జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చర్చ‌లు ఉన్నాయి.

ప‌వ‌న్ జ‌గ‌న్‌ను దారుణంగా టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌వ‌న్‌ది రాజకీయం, ఆవేశం. అయితే అల్లు అర‌వింద్‌కు కూడా ఏపీ ప్ర‌భుత్వం మీద కోపం ఉంటే ఉండొచ్చు గాక‌.. అయితే ఆయ‌న‌ది కోట్లాది రూపాయ‌ల వ్యాపారం. అందుకే ఆయ‌న జ‌గ‌న్‌ను ఇటీవ‌ల బ‌తిమిలాడుకుంటోన్న ధోర‌ణితో మాట్లాడారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలే 12 మంది వ‌ర‌కు ఉన్నారు. నిన్న‌కాక మొన్న వ‌చ్చిన వైష్ణ‌వ్ తేజ్ సైతం తొలి సినిమా ఉప్పెన‌తోనే రు. 50 కోట్లు కొల్ల‌గొట్టాడు. రెండో సినిమా కొండ‌పొలం సైతం మంచి అప్లాజ్ తెచ్చుకుంది.

నాని లాంటి హీరోల సినిమాలు ఓటీటీలో వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న స్టార్ హీరోల‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ న‌లుగురు మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. ఇక వ‌రుణ్ తేజ్‌, సాయితేజ్‌, వైష్ణ‌వ్ తేజ్ ఇలా ఈ మీడియం రేంజ్ హీరోల‌కు కూడా మంచి మార్కెట్టే ఉంది. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకుంటోన్న నిర్ణ‌యాలు మెగా ఫ్యామిలీకి మామూలు దెబ్బ‌కాదు. ఆర్థికంగా ఆ ఫ్యామిలీకి ఇది కోలుకోలేని దెబ్బే అవుతుంద‌ని అంటున్నారు.

ఏపీలో బెనిఫిట్ షోలు లేవు, టిక్కెట్ల రేట్లు బాగా త‌గ్గించేశారు. పైగా ఇప్ప‌ట‌కీ నాలుగు షోలు కొన్ని చోట్ల వేయ‌డం లేదు.. ప‌ర్మిష‌న్లు లేవు. మ‌రోవైపు థియేట‌ర్ల‌లో 100 శాతం ఆక్యుపెన్సీ లేదు. రెవెన్యూ లేన‌ప్పుడు నిర్మాత‌లు ఎంత పెద్ద మెగా ఫ్యామిలీ అయినా, స్టార్ హీరోలు న‌లుగురు ఉన్నా వారితో సినిమాలు తీసేందుకు ముందుకు రారు. ఇక వారి రెమ్యున‌రేష‌న్లు కూడా భారీగా త‌గ్గించుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇక్క‌డ మ‌రో విమ‌ర్శ కూడా ఉంది. గ‌తంలో ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు మెగా కాంపౌండ్‌కు చెందిన నిర్మాత బ‌న్నీ వాస్ లాంటి వాళ్లే ఇండ‌స్ట్రీలో మాది స‌గం అని కౌంట‌ర్లు ఇచ్చారు. అదే కాంపౌండ్ వాళ్లు అవి నంది అవార్డులు కాదు.. నంద‌మూరి అవార్డులు అని విమ‌ర్శించారు. మ‌రి కొంద‌రు అవి టీడీపీ అవార్డులు అన్నారు.. నాటి ప్ర‌భుత్వాన్ని, చంద్ర‌బాబును తీవ్రంగా విమ‌ర్శించారు. అదే మెగా కాంపౌండ్ ఇప్పుడు జ‌గ‌న్‌ను అభ్య‌ర్థించుకోవ‌డం ఏంటి ? ప‌వ‌న్ లా గ‌ట్టిగా ఎందుకు నిల‌దీయ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌కు వారే ఆన్స‌ర్ చేసుకోవాలి.

ప‌దే ప‌దే జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం.. చివ‌ర‌కు అర‌వింద్ లాంటి పెద్ద మ‌నిషి కూడా దారుణంగా త‌న స్థాయికి త‌గ్గి రాజు త‌ల‌చుకుంటే వ‌రాల‌కు కొద‌వా అంటూ వేడుకున్నారు. ఏదైనా సినిమా వాళ్లంద‌రిది ఒకే కులం.. ఇక్క‌డ మేం గొప్ప‌.. మేం ఎక్కువ అన్న గొప్ప‌లు, ప‌ట్టింపుల‌కు పోకూడ‌దు.. నంద‌మూరి అయినా, కొణిదెల కాంపౌండ్ అయినా, అక్కినేని, ద‌గ్గుబాటి లేదా మ‌రో ఫ్యామిలీ హీరో అయినా ఒక‌రిక‌కొరు ఇలాంటి క‌ష్ట‌న‌ష్టాల్లో పాలు పంచుకోవాలి. గొప్ప‌లు పోతే ఎప్ప‌ట‌కి అయినా ఇలా తిప్ప‌లు త‌ప్ప‌వు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news