అక్కినేని నాగచైతన్య – సమంత నాలుగేళ్ల వైవాహిక బంధానికి తీవ్ర ఉత్కంఠ తర్వాత ముగింపు వచ్చేసింది. వీరిద్దరు విడిపోయారు. ఇక ఎవరి జీవితం వారిదే..! అయితే వీళ్లిద్దరి ప్రేమకు బీజం వేసిన సినిమా మాత్రం ఆటోనగర్ సూర్య. అంతకు ముందే వీరిద్దరు కలిసి ఏమాయ చేశావే సినిమాలో నటించినా కూడా ఆటోనగర్ సూర్య టైం నుంచే వీరు ప్రేమలో పడ్డారన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
ఆ సినిమా షూటింగ్ టైంలోనే వీరి ప్రేమ మొగ్గ తొడిగిందని అంటారు. తాజాగా వీరి విడాకుల నేపథ్యంలో ఆ సినిమా డైరెక్టర్ దేవ కట్టా స్పందించారు. వాళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తనకు తెలుసు అని.. బంధం వర్కవుట్ కానప్పుడు.. బలవంతంగా సమాజం కోసం భార్య, భర్తలుగా ఉండడం కంటే విడిపోయి స్నేహితులుగా ఉండడమే మంచిదని చెప్పారు.
ఇక చైతు – సమంత చాలా మంచి వ్యక్తులు అని.. ఆటోనగర్ సూర్య టైంలో వారిద్దరు మంచి స్నేహితులుగాను, మెచ్యూర్డ్గాను ఉండేవారని దేవ చెప్పారు. అయితే ఆ టైంలో వారు ప్రేమలో ఉన్నారా ? లేదా ? అన్నదానిపై స్పందిస్తూ వారు ప్రేమలో ఉన్నా ఆ విషయం నాకు తెలియదని.. అయితే సెట్స్ లో మాత్రం చాలా ప్రొఫెషనల్‌గానే ఉండేవారని.. వారి ప్రేమ విషయాన్ని అప్పట్లో తాను గమనించలేదని చెప్పారు.
ఇక సమంత కంటే చైతు తనకు చాలా క్లోజ్ అని.. చైతుతో భవిష్యత్తులో ఓ ప్రేమ కథా సినిమా చేస్తానని దేవ కట్టా చెప్పాడు.