తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో రసవత్తరమైన మలుపులు తిరుగుతున్నాయి. మా ఎన్నికలు ఇప్పుడు సాధారణ ఎన్నికలను మించిన రణరంగంగా మారిపోయాయి. ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు వర్గాల మధ్య మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. ప్రకాష్‌రాజ్‌కు ఎలాగూ మెగా ఫ్యామిలీ సపోర్ట్ ముందు నుంచే ఉన్నట్టు కనిపిస్తోంది. అటు విష్ణుకు తాజా అధ్యక్షుడు నరేష్‌తో పాటు కొందరు సపోర్ట్ చేస్తున్నారు.
ఇక పోస్టల్ బ్యాలెట్ ఓటు దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రకాష్‌రాజ్, జీవిత రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడంతో పాటు మంచు ఫ్యామిలీని సైతం టార్గెట్ చేశారు. ఇక అటు వైపు నుంచి నరేష్, విష్ణు కూడా కౌంటర్ ప్రెస్మీట్లు పెడుతున్నారు. లేటెస్ట్ పరిణామాలు చూస్తుంటే ప్రకాష్‌రాజ్‌కు మెగా ఫ్యామిలీ హ్యాండ్ ఇచ్చిందా ? అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాల్లోనే వస్తున్నాయి.
ఇక విష్ణుకు సీనియర్ నటులు అందరూ మద్దతు ఇస్తున్నారు. ప్రకాష్‌రాజ్ లోకల్‌గా ఉండడు.. పైగా పరభాషా నటుడు కావడంతో సీనియర్ల నుంచి సహకారం లేదు. ఇక కృష్ణ, కృష్ణంరాజు, బాలయ్య, అటు చెన్నైలో ఉండే లక్ష్మి, శారద, శరత్‌బాబు ఇలా సీనియర్లు అందరూ విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు విష్ణుకు నరేష్ నుంచి అందరూ సపోర్ట్ చేస్తున్నారు.
మరోవైపు ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్లో ఆయన మాత్రమే వాయిస్ వినిపిస్తున్నారు. జీవిత మాట్లాడినా జనాలు ఆమెను ఎంత వరకు నమ్ముతారు ? అన్నది చెప్పలేం. నాగబాబు అప్పుడెప్పుడో సపోర్ట్ చేస్తున్నామని చెప్పడమే మినహా తెరవెనక వ్యూహాలు పెద్దగా పన్నడం లేదంటున్నారు. మరోవైపు సాయిధరమ్ హడావిడితో పాటు తన షూటింగ్లలో చిరు బిజీగా ఉన్నారు.
దీంతో పాటు చిరు ఓపెన్‌గా అయినా తాము ప్రకాష్‌రాజ్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు ఓ ప్రెస్‌మీట్ లేదా ప్రకటన చేయలేదు. ఓ నటి సపోర్ట్ కోసం చిరంజీవిని కలిసే ప్రయత్నం చేసినా ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటున్నారు. ఇంత జరుగుతున్నా నాగబాబు కూడా సైలెంట్ అయిపోవడంతో మెగా ఫ్యామిలీ నడిసంద్రంలో ప్రకాష్‌రాజ్‌ను వదిలేసిందా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.