ఆయన టాలీవుడ్లో ఓ సూపర్ హీరో.. పెద్ద స్టార్. వరుస హిట్లతో దూసుకు పోతున్నాడు. పైగా ఆయన ఒక్కో సినిమాకు రు. 50 నుంచి రు. 55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న ప్రచారం ఉంది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య బాగా ఆయన చేతిచమురు వదిలించేస్తోందట. టాప్ హీరో కావడంతో ఆయన ఖర్చు పెట్టేందుకు ఇబ్బంది ఉండదు. పైగా చేతిలో సినిమాలు ఉంటే చాలా మంది టాప్ హీరోలు రెమ్యునరేషన్లతో పాటు తమ చిల్లర ఖర్చులకు కూడా నిర్మాతలనే పీల్చి పిప్పి చేస్తుంటారు.
ఈ కోవలకే వచ్చే ఓ టాప్ హీరో భార్య చేసే ఖర్చు మామూలుగా ఉండదన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమె మూడు ముళ్లు వేయించేసుకుని టాప్ హీరోకు ఎంచక్కా భార్య అయిపోయింది. అయితే ఇప్పుడ ఇక్కడ ఆమె పెట్టే ఖర్చు మామూలుగా ఉండదట. ఆమెకు సొంత కంపెనీలు.. సంపాదన అంటూ ఏదీ లేదు.
సిటీలో ఉన్న తన స్నేహితులకు ఇచ్చే పార్టీలు, ఫ్రెండ్స్ కోసం చేసే ఖర్చు కోట్లలోనే ఉంటోందట. ఈ ఖర్చు సదరు హీరోకు ఓ లెక్క కాకపోయినా.. ఆయనకు ప్రశాంతంగా ఉండడమే ఇష్టం. కనీసం సినిమా చూడాలన్నా ముంబై వెళతాడు. అయితే ఆయన భార్య ఇంట్లో పార్టీల పేరుతో రచ్చ రచ్చ చేస్తుండడంతో పాటు షాపింగ్లు, గిఫ్ట్లు అంటూ విదేశాల్లోనే విహరిస్తూ భారీగా ఖర్చు పెట్టేస్తోందట. ఎంతైనా భార్య కదా ? ఆ సూపర్ హీరోగారు ఇవన్నీ భరిస్తున్నాడన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.