Moviesక్రేజీ అప్‌డేట్‌: గాడ్‌ఫాద‌ర్‌లో మెగాస్టార్ త‌ల్లిగా షాకింగ్ ప‌ర్స‌న్‌...!

క్రేజీ అప్‌డేట్‌: గాడ్‌ఫాద‌ర్‌లో మెగాస్టార్ త‌ల్లిగా షాకింగ్ ప‌ర్స‌న్‌…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా కోసం తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే గాడ్ ఫాద‌ర్‌తో పాటు వేదాళం రీమేక్‌లో మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు.

ఇక గాడ్ ఫాద‌ర్ సినిమా గురించి వ‌స్తోన్న ప‌లు విష‌యాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రో క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. గాడ్ ఫాద‌ర్‌లో చిరుకు త‌ల్లిగా యూట్యూబ‌ర్‌, బిగ్‌బాస్ గంగ‌వ్వ న‌టించ‌బోతోంద‌ట‌. మోహ‌న రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

సినిమాలో త‌ల్లి పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే సినిమాకు సంబంధించిన స‌హాయ ద‌ర్శ‌కులు గంగ‌వ్వ‌కు క‌థ చెప్పి ఆమెను ఈ పాత్ర‌కు ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది. తెలుగు ప్రేక్ష‌కుల్లో గంగ‌వ్వ బాగా పాపుల‌ర్ అయ్యింది. ఆమె చిరుకు త‌ల్లిగా అంటే ఖ‌చ్చితంగా ఈ పాత్ర పండుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జ‌ర‌గుతోంది. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. వ‌చ్చే యేడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news