Moviesస‌మంత విడాకుల పోస్టు పెడితే ఇన్ని ల‌క్ష‌ల లైకులా...!

స‌మంత విడాకుల పోస్టు పెడితే ఇన్ని ల‌క్ష‌ల లైకులా…!

చైత‌న్య – స‌మంత విడిపోయారు. ఇద్ద‌రూ క‌లిసి ఓ అండ‌ర్ స్టాండింగ్‌తో ఒకే మెసేజ్‌ను వారి వారి సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌లో పోస్టు చేశారు. విడిపోయినా కూడా త‌మ‌ది ప్ర‌త్యేక‌మైన అనుబంధంగా వారు చెప్పారు. వీరు విడిపోతున్న‌ట్టు చెప్పారో లేదో ఒక్క‌సారిగా న్యూస్ ఛానెల్స్‌కు పెద్ద సంబ‌రంగా మారింది. వారు ఇష్ట‌మొచ్చిన‌ట్టు క‌థ‌నాలు వండి వార్చేసుకున్నారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలోనూ, ఫేస్‌బుక్‌, వాట్సాప్ గ్రూపుల్లో ఇదే వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇక స‌మంత ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టా అక్కౌంట్‌లో పోస్టు చేసింది. అయితే అక్క‌డ నెగిటివ్ కామెంట్లు వ‌స్తాయ‌నో ఏమోగాని ఆమె త‌న మెసేజ్ బాక్స్‌ను హైడ్ చేసింది. అయితే ఆమె పెట్టిన పోస్టుకు ఏకంగా నెటిజ‌న్లు 12 లక్ష‌ల లైకులు కొట్టారు. ఇది ఇంకా ఎక్క‌డి వ‌ర‌కు వెళుతుందో ? చూడాలి. విడాకులు తీసుకుంటున్నామ‌ని పోస్టు పెడితే అదేదో పెద్ద ఇంపార్టెంట్ వార్త‌లా ఇంత మంది లైకులు కొట్ట‌డం ఏంటా ? అని అంద‌రూ అవాక్క‌వుతున్నారు.

ఇదేమైనా విడాకుల ప్ర‌క‌ట‌నా ? వివాహ ప్ర‌క‌ట‌నా ? అని మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా తాము ఎంతో అభిమానించే న‌టి పెట్టిన పోస్టు కావ‌డంతో ఆమెకు ఉన్న ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్స్‌లో కొంద‌రు ఆమెపై అభిమానంతో ఇలా ఓ లైక్ వేసుకుని ఉంటార‌ని అర్థ‌మ‌వుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news