కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను, సవాళ్లను ఎదుర్కొని ఈరోజు మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు ఘనత మెగాస్టార్ చిరంజీవి కే సాధమైంది. తన మెగా హిట్స్ తో తెలుగు సినిమా స్టామినా పెంచిన మెగాస్టార్ బాక్సాఫీస్ కింగ్ గా వెలిగారు.
హీరోగా అడుగు పెట్టినా .. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కష్టఫడి ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు మెగాస్టార్ చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ ప్రేక్షకులకు కొత్త హీరోయిజాన్ని పరిచయం చేశారు చిరు. యంగ్ జనరేషన్ నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవికి సినిమాల్లో ఉండే మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎఆయన డాన్సులకు ఉండే క్రేజ్ మరో లెవల్.
అయితే తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించిన ఈయన..ఎన్నో సినిమాలో చేసిన ఈయన మాత్రం..హీరోయిన్‌తో కలిసి నటించే రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఎక్కడా హద్దులు దాటకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా లిప్ లాక్ సీన్లకి ఆమడ దూరంలో ఉండే ఈయన.. ఓ సినిమాలో మాత్రం హీరోయిన్‌తో లిప్‌లాక్ సీన్‌లో నటించాల్సి వచ్చింది. నటించారు కూడా.. ఇంతకి ఆ సినిమా ఏంటో తెలుసా..?? “ఘరానా మొగుడు.”
చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఘరానా మొగుడు సినిమాలో పండు పండు.. అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ పాట ఒకటి ఉంది. ఆ పాటలో హీరోయిన్ నగ్మాతో మెగాస్టార్ లిప్‌లాక్ చేయాల్సి ఉంటుంది. చిరంజీవి ఎంత వద్దు వద్దు అని చెప్పుతున్న డైరెక్టర్ మాత్రం చేయాల్సిందే అని మొండి చేసి మరీ చిరు దగ్గర ఆ లిప్ లాక్ సీన నటించేలా చేసారు. కానీ ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. ఆయనలోని నైతికత ఆయనకు నిద్ర రానివ్వలేదు. వెంటనే మద్రాసుకు వచ్చి ఎడిటింగ్ ల్యాబ్‌కు వెళ్లి ఆ లిప్‌లాక్ సీన్‌ను ఎడిట్ చేయించేశారట. అందుకే మనకు ఆ పాటలో ఆ లిప్ లాక్ సీన్ కనిపించదు.