స్మాల్ స్క్రీన్ పై నవ్వుల హంగామా చేసే జబర్దస్త్ షో అందరికి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న షో ఏదైనా ఉందా అంటే అది జబర్డస్త్ కామెడీ ప్రోగ్రామ్. ఇప్పటివరకు దీని ద్వారా మంచి గుర్తింపు పొంది ఇండ్రస్ట్రీలో స్థిరపడ్డారు. ఈ షో ఇప్పటికీ కొనసాగుతూ బుల్లితెర సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. ఈ ఒక్క షోతో వందల మంది నటులు ఇండస్ట్రీకి వచ్చారు. పదుల సంఖ్యలో కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు. వారానికి రెండు రోజులు అన్నీ మరిచిపోయి ప్రేక్షకులను హాయిగా నవ్విస్తుంది ఈ షో.
ఇక ఈ షో లో యాంకర్లు గా చేసే వారి రెమ్యునరేషన్ గురించి అభిమానుల్లో ఎల్లప్పుడూ ఆసక్తికరంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బుల్లితెరపై గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘జబర్దస్త్ కామెడీ షో’లో కంటెస్టెంట్ల దగ్గర నుంచి జడ్జీల వరకు ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకుంటున్నారనేది ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్న మనో, రోజాతో పాటు కమెడియన్ల రెమ్యునరేషన్ వివరాలు కూడా లీక్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.
ఇక కంటెస్టెంట్ ల విషయానికి వస్తే ఓ వైపు జబర్దస్త్ షోతో పాటు బయట కూడా కార్యక్రమాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు వాళ్లు. ఇక ఇప్పుడు జబర్ధస్త్ షో లో జడ్జిలగా వ్యవహరిస్తున్న రోజా ఒక్కో ఎపిసోడ్కు 5 నుంచి 7లక్షలు తీసుకునేదని వార్తలు వినిపిస్తున్నాయి. అటు యాంకర్లగా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మిలకు నెలకు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఇస్తారని సమాచారం.ఇక టీమ్ లీడర్స్ విషయంలో అందరికంటే ఎక్కువగా సుడిగాలి సుధీర్ నెలకు 4 లక్షలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇక రైటర్ కమ్ యాక్టర్ రాంప్రసాద్ 3 లక్షలు, హైపర్ ఆది రూ. 3 లక్షలు అందుకుంటుండగా.. గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు చెరో 2.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నారు. ఇక ఇతర కామెడియన్లకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.