Moviesమీలాంటి వాళ్ళ వల్లే జీవితాలు నాశనం అవ్వుతున్నాయి...అనుష్క సీరియస్ వార్నింగ్..!!

మీలాంటి వాళ్ళ వల్లే జీవితాలు నాశనం అవ్వుతున్నాయి…అనుష్క సీరియస్ వార్నింగ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ప్రత్యేకమైన పాత్రలలో నటిస్తూ మంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ గ్లామర్ బ్యూటీ.. బాహుబలి సినిమాలో నటించి గ్లోబల్ స్టార్ గా మారిపోయింది అనుష్క. గత 15 ఏళ్ల క్రిందట ‘సూపర్’ సినిమాతో పరిచయమై టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది.

అటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరనస నటించారు. బాహుబలి, అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో ఆమె ఇమేజ్ తార స్థాయికి చేరింది. వెండితెరపై స్వీటీ అందం, అభినయం చూసి అన్ని భాషా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాంటి ఈ అనుష్క ఈ మధ్య సినిమాలకు దూరం అయ్యింది. ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా గత సంవత్సరం విడుదల కాగా అదే చివరి చిత్రం అయ్యింది. ప్రస్తుతం అనుష్క ఓ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా షుటింగ్ లో సమయంలో చిత్ర యూనిట్ సభ్యులకి అనుష్క సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఎందుకంటే..షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న కొంత మంది స్మోకింగ్ చేస్తూ కనపడ్డారట.
దీంతో చిరెత్తుకొచ్చిన అనుష్క కి వాళ్ళ దగ్గరకు వెళ్ళి చడా మడా తిట్టేసిందట. మీలాంటి వారి వాళ్ళ్లే మిగతా వారి జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి అంటూ గట్టిగా క్లాస్ తీసుకున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news