యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని టాలీవుడ్‌లోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరిగా ఉన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన రామ్ పోతినేని ఎవరో కాదు ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడు మురళీ కొడుకు. రామ్ 1987 మే 15వ తేదీన జన్మించాడు. మనోడు పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే అయినా చదివింది మాత్రం చెన్నైలోనే..! తన పెదనాన్న రవికిషోర్ ఆధ్వర్యంలోనే రామ్ సినీ రంగం ఎంట్రీ జరిగింది.
రవికిషోర్ రామ్‌ను నట శిక్షకుడు అయిన ఎన్‌జె. బిక్షు దగ్గర చేర్పించాడు. దీంతో రామ్ అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పట్లో టాప్ డైరెక్టర్‌గా ఉన్న వైవీఎస్. చౌదరి స్వీయ దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టేసి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. ఆ సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయం అయిన ఇలియానా ఆ తర్వాత తెలుగు సినిమా ఓ ఊపు ఊపేసింది.
దేవదాసు సినిమా రామ్ కి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా లభించింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో జగడం సినిమాలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో జెనీలియా హీరోగా రామ్ చేసిన రెఢీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రామ్‌కు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మధ్యలో కొన్ని ప్లాపులు వచ్చినా నేను శైలజ సినిమా రామ్ కెరీర్‌ను టర్న్ చేసింది. తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌తో మనోడు మాస్‌లో దూసుకుపోయాడు.