Moviesపేరంట్స్ కోసం మీ లైఫ్ ని నాశనం చేయాల్సిన అవసరం లేదు...

పేరంట్స్ కోసం మీ లైఫ్ ని నాశనం చేయాల్సిన అవసరం లేదు ..గుండె గుభేల్ మనిపించిన చిన్మయి..!!

సింగర్ చిన్మయి శ్రీపాద.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక్క హాట్ టాపిక్ తో సోషల్ మీడియ్యలో దూమారం రేపుతుంటుంది. ఈ మధ్య తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో ఎంత యాక్టివ్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పుడు తాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తమిళ రచయిత వైరముత్తు మీద గొడవకు దిగిన చిన్మయి అక్కడ సింగర్ గా అవకాశాలను కోల్పోయింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఆమె సినిమాలకు డబ్బింగ్ చెప్పే అవకాశం ఇవ్వట్లేదని తెలుస్తుంది.

అయితే తెలుగులో చిన్మయికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఆమె సమంతకు తెలుగు డబ్బింగ్ చెబుతుంది. కేవలం సింగర్ గానే కాకుండా సామాజిక అంశాలపై గళం ఎత్తుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సింగర్ చిన్మయి. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ.. సంచలన విషయాలతో హాట్ టాపిక్ అయ్యారు సింగర్ చిన్మయి. సోషల్ మీడియాలో ఎప్పూడు యాక్టివ్‌గా వుండే ఈ సింగర్ తనదైన స్టైల్‌లో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగింక వేధింపులను అడ్రెస్ చేస్తూ అవసరమున్నవారికి అండగా ఉంటోంది.

ఇక తాజాగా సోషల్ మీడియా లైవ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించిన ఈ అమ్మడు..కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఈమె వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. లైవ్ లో సింగర్ చిన్మయి శ్రీపాద తల్లిదండ్రులు పెళ్లి గురించి పెట్టే బాధలను వివరించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ చిన్మయిని ఓ సలహా అడిగింది. పేరంట్స్ కోసం మనం ఎలాంటి త్యాగమైనా చేయోచ్చా? ముఖ్యంగా పెళ్లి విషయంలో చేయోచ్చా? అని అడిగింది. దానికి చిన్మయి స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది. “అలాంటి త్యాగాలేమీ చేయోద్దు. మీకు నచ్చనివారిని పెళ్లిచేసుకోని ..మీ లైఫ్ ని వారి కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకి అబ్బాయి మరీ అంత నచ్చితే.. ఆ అబ్బాయిని ఇంటికి తెచ్చి.. పెంచుకోమనండి.. అంటూ ఘాటుగా ఆన్సర్ చేసింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news