తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు ఓ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అటు ప్రకాష్‌రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. మా ఎన్నికలకు పొలిటికల్ పార్టీలకు లింక్ లేదని రెండు ప్యానెల్స్ వారు చెపుతున్నారు. అయితే అంతర్గతంగా జరుగుతోన్న సంభాషణలు, తెరవెనక తంతులను బట్టి చూస్తే మా ఎన్నికలు ఇప్పటికే పొలిటికల్ రంగు పూసుకున్నట్టే కనపడుతోంది.
మా ఎన్నికలలో ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కు తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో పాటు ఆ పార్టీ కీలక నేత కేటీఆర్ సపోర్ట్ ఉందని ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. ప్రకాష్‌రాజ్ పలు సందర్భాల్లో కేటీఆర్‌ను కలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రకాష్‌రాజ్‌కు ముందు మెగా ఫ్యామిలీ బహిరంగంగా సపోర్ట్ చేస్తుంటే తెరవెనక కేటీఆర్, టీఆర్ఎస్ సపోర్ట్ ఉందనే అంటున్నారు. ఇక మంచు విష్ణు వైసీపీలోనే ఉన్నారు. గత ఎన్నికలకు ముందే ఆయన తండ్రితో కలిసి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
పైగా జగన్ ఆయనకు సమీప బంధువే. ఇక వైసీపీలో కీలక నేతగా ఉన్న 30 ఇయర్స్ పృథ్వి సైతం విష్ణు ప్యానెల్లోనే పోటీ చేస్తున్నారు. ఆయనకు ఏపీలో వైసీపీ నేతలతో పాటు ఇండస్ట్రీలో ఉన్న వైసీసీ సానుభూతి పరులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం సానుభూతి పరుల్లో కూడా కొందరు విష్ణుకు కుల లేదా ఇతరత్రా సమీకరణలతో సపోర్ట్ చేస్తున్నారు. బాలయ్య సపోర్ట్ విష్ణుకే ఉంది.
ఇక వైసీపీ నుంచి బయటకు వచ్చిన జీవిత లాంటి వాళ్లు కూడా ఇప్పుడు విష్ణు వ్యతిరేక ప్యానెల్లోనే ఉన్నారు. ఇక పవన్ కూడా ప్రకాష్‌రాజ్‌కే సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పేస్తున్నారు. విష్ణు లాంటి వాళ్లు తనకు చంద్రబాబు, జగన్ బంధువు అని, కేటీఆర్ మంచి ఫ్రెండ్ అని.. మా ఎన్నికలకు పొలిటికల్ రంగు పులమవద్దని చెపుతున్నా కూడా ఇది ఆగేలా లేదు.