‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళి.. మళ్ళీ అదే రేంజ్లో RRR రూపొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రౌద్రం, రణం, రుధిరం. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సీరిస్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పటకి రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. చిన్నచిన్న షాట్లు మినహా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయినట్లు ఈ మధ్యకాలంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అని యేడాదిన్నర కాలంగా ఊరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు డేట్లు వేసి మరీ రిలీజ్ అని చెప్పి.. వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
నిజానికి ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాల్సింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్డౌన్ వల్ల షూటింగ్లు ఆగిపోవడంతో అనుకున్న సమయానికి సినిమా పూర్తికాలేదు. ఆ తరువాత దసరాకు విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ అది కూడా కుదరలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. మరి చూడాలి ఈ డేట్ అయినా ఫిక్స్ అవుతుందో లేక వాయిదా పడుతుందో..?