పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటింగ్ సినిమా భీమ్లా నాయక్ ఓటిటి బరిలోకి వెళ్తుందా ? తాజాగా జరుగుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణే స్వయంగా ఈ సినిమాను ఓ టీటీ లో రిలీజ్ చేయమని నిర్మాతలకు సలహా ఇచ్చారా ? అంటే ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. సాగర్ కె . చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ – రానా-నిత్య మీనన్ లాంటి మల్టీ స్టార్ కాస్ట్ తో త్రివిక్రమ్ లాంటి ఏస్ డైరక్టర్ సలహాల తో తెరకెక్కు తోన్న ఈ సినిమాకు తాము అనుకున్న భేరం వస్తే ఓ టీటీ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు కూడా వెనుకాడడం లేదంటున్నారు.
మళయాళంలో హిట్ అయిన అయ్యప్ప కోషియమ్ నుంచి మెయిన్ లైన్ తీసుకుని దానిని ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు గ్లింప్స్ తో పాటు పాటకు మంచి క్రేజ్ వచ్చింది. పైగా రానా – నిత్యామీనన్ కాంబినేషన్ కావడంతో ఇప్పటికే హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడు అయ్యాయి.
ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ శాటిలైట్, డిజిటల్ కలుపుకుని రు. 70 కోట్లకు భేరసారాలు నడుస్తున్నాయంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీర్ మార్కెట్ ఎంత లేదన్నా రు. 80 కోట్లు ఉంటుందని చెపుతున్నారు. అంటే మొత్తంగా రు. 170 కోట్ల రేంజ్లో ఈ సినిమా బిజినెస్ జరుగుతుందని ఓ అంచనాకు వస్తున్నారు. ఆ మొత్తం వస్తే ఓటీటీకి ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే అంటున్నారట.