Movies"భవదీయుడు భగత్‌సింగ్" నుండి క్రేజీ అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే..?

“భవదీయుడు భగత్‌సింగ్” నుండి క్రేజీ అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఒక సినిమా పూర్తి కాకముందే మరొక సినిమా కు సైన్ చేస్తూ..కెరీర్ ను బిజీ బిజీ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినీ జోరు చూస్తుంటే..రానున్న రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ కు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన ప‌వ‌న్ త్వ‌ర‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొన‌నున్నాడు. ఈ మధ్యనే పవన్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 28వ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ అక్టోబర్ 15న అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అదే రోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ లో కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news