మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ చరిత్రలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వేసిన చిన్న విత్తనంతో పెరిగిన ఈ ఫ్యామిలీ నుంచే ఈ రోజు ఇండస్ట్రీలో ఏకంగా డజను మందికి పైగా హీరోలు ఉన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన కాపు ఫ్యామిలీ. తాజాగా పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో కులాల ప్రస్తావన తెస్తూ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.
రెడ్డి వర్గానికే చెందిన నిర్మాత దిల్ రాజు తనతో సినిమా చేయడంతోనే ఏపీ ప్రభుత్వం సినిమాలు ఆపేసిందని చెప్పారు. మీరూ రెడ్డే.. జగనూ రెడ్డే మీరు వెళ్లి మాట్లాడి మా ఇబ్బంది పరిష్కరించాలని కాస్త వ్యంగ్యంగానే అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి ఉన్న రెడ్డి బంధుత్వాన్ని ప్రశ్నిస్తూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు కౌంటర్లు ఇస్తున్నారు.
చిరంజీవి వియ్యంకుడు (రామ్ చరణ్ మామ) కూడా రెడ్డే. ఉపాసన అపోలో ప్రతాప్ రెడ్డికి స్వయానా మనవరాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక చిరు బావమరిది అల్లు అరవింద్ వియ్యంకుడు ( అల్లు అర్జున్ మామ ) కూడా రెడ్డే. ఉపాసన వాళ్లది నిజామాబాద్ జిల్లా అయితే.. అల్లు అర్జున్ మామ వాళ్లది నల్లగొండ జిల్లా.