Gossipsకెరీర్ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రష్మిక..?

కెరీర్ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రష్మిక..?

రష్మిక మందన.. ఓ వైపు టాలీవుడ్..ఓ వైపు బాలీవుడ్..మధ్యలో కోలీవుడ్ అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ గా తన సత్త చాటుతున్న భామ రష్మిక అనే చెప్పాలి. టాలీవుడ్ లో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తున్నా కానీ ఈ అందాల ముద్దుగుమ్మ ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయలేకపోతున్నారు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మిక.

ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటింస్తున్న రష్మిక.. బాలీవుడ్‌లోను మూడు చిత్రాల్లో నటిస్తూ అక్కడ ప్రజలను నటన తో తన బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మిక కు ఓ బంపర్ ఆఫర్ వచ్చిన్నత్లు తెలుస్తుంది. అది ఏమిటంటే..తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆమె ఓ సినిమా చేస్తుంది అనే వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్‌ వార్‌ డ్రామా కథాంశంతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. స్వప్న సినిమా – వైజయంతీ మూవీస్ వారు, దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా ఒక సినిమాను నిర్మిస్తున్నారు.

ఇండియా-పాకిస్థాన్‌ మధ్య 1964-65లో జరిగిన యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అతిథి పాత్రలో రష్మిక మందన్న కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం కొంతకాలం క్రితం రష్మికను సంప్రదించగా, రీసెంట్ గా ఓకే చెప్పిందట. నిజానికి ఈ పాత్ర గెస్ట్ రోల్ నే అయినా..సినిమాలో కీలకంగా ఉంటూ నటనకు ప్రాముఖ్యమున్న పాత్ర కావడంతో రష్మిక మందన్న ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందని చెబుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news