పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. ఆ పేరు చెబుతుంటేనే ఆయన అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్..టాలీవుడ్ కి ఎన్నో భారి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. సినీ నటుడిగా పవన్ కల్యాణ్ స్టార్ డమ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. అందరికన్నా భిన్నంగా సాగిపోయే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే.. ఎవ్వరికైనా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.
పేరుకి చిరంజీవి తమ్ముడే అయినా.. ఆయన ఏనాడు ఆ పేరు వాడుకోలేదు.. తన కష్టంతో..తన నటనతో..మంచి సినిమాలను ఎంపిక చేసుకుని..ట్రెండ్ ఫాలో అవ్వకుండా..ట్రెండ్ సెట్ చేసుకున్నాడు పవన్. అందుకే ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉంటారు. ఇక వకీల్ సాబ్ చిత్రం రీ ఎంటృఈతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్..వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు. ఓ వైపు రాజకీయాలు మరో వైపు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాడు.
ఇక ప్రస్తుతం..ఆయన ఒక్కో సినిమాకి 60కోట్లు పారితోషకం పుచ్చుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడంటే హీరోలు అందరు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కాని పవన్ కళ్యాన్ ఫస్ట్ సినిమా కి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా..?? ఆశ్చర్య పోతారు. 1996వ సంవత్సరంలో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు గాను కేవలం 5,000 రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కగా ఆ సినిమా నిర్మాత అయిన అల్లు అరవింద్ పవన్ కు 5,000 రూపాయల పారితోషికం ఇచ్చారని ఒక మీడియా సంస్థకు పవన్ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించిన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ తరువాత ఒక్కో సినిమాకి రెమ్యూనత్రేషన్ పెంచుకుంటూ..ఈస్దాయికి వచ్చాడు పవన్ కళ్యాణ్.