రాజకీయాలు, సినిమా.. తెలుగు నాట ఎప్పుడూ ఉండే హాట్టాపిక్లు గానే ఉంటాయి. మరీ ముఖ్యంగా నందమూరి వారసుల గురించి అయితే ఎప్పుడు ఏదో ఒక్క వార్త ట్రెండింగ్ లోనే ఉంటుంది. నందమూరి తారక రామారావు వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాల్సిన పనిలేదు. ఇద్దరుకు ఇద్దరే పోటాపోటిగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు.
ఇక నిజానికి వీరిద్దరూ బాబాయ్.. అబ్బాయ్ వరస అవుతారనే విషయం మనకు తెలిసందే తెలిసిందే. అయితే తాజాగా వీళ్లిద్దరి గురించి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది. అదేమిటంటే..సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బాలకృష్ణను మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఎలా కలుసుకున్నారనే విషయం. ఇక ఈ విషయంగా పరుచూరి గోపాలకృష్ణ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ హీరోగా అల్లరి రాముడు అనే సినిమా వచ్చింది అందరికి గుర్తుండేఉంటుంది. హా అయిన మరిచిపోయే నటన ఆయనది. ఆ సినిమాలో ఇరగదీసాడు తారక్. ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడ్ ..అదే సమయంలో అక్కడ పరుచూరి గోపాలకృష్ణ, బాలకృష్ణ ఇతర ప్రముఖులు కూడా ఉన్నారట. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పరుచూరి గోపాల కృష్ణతో మాట్లాడుతూ.. మీరు మా తాత ఎన్టీఆర్ గారికి ఎంత పెద్ద అభిమానో నాకు తెలుసు..
నేను కూడా మీలాగే బాలకృష్ణ గారికి అంత పెద్ద అభిమానిని అని చెప్పడంతో.. వెంటనే ఆయన మరి మీ బాబాయిని కలిసావా అంటే..అమ్మో లేద్ సార్..నాకు బాబాయ్ అంటే భయం అంటూ సినిమా థియేటర్ లో ఆయన సినిమా వచ్చినప్పుడు పేపర్లు చించి విసిరేస్తూ ఎంజాయ్ చేసేవాడిని అని తెలిపారట తారక్.ఆ మాటలు విన్న పరుచూరి..మీ బాబాయ్ కి పరిచయం చేస్తాను రా అంటూ వంటనే చెయ్యి పట్టుకుని లాకుని వెళ్లి బాలకృష్ణ తో పరిచయం చేయించి మాట్లాడించారట. అలా ఫస్ట్ టైం వీళ్లు కలిసారని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.