టబు.. ఈ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో..తన అందంతో..తన గ్లామర్ తో సినీ ఇండస్ట్రీని ఏలేసిన నటి. టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్స్ ఏర్పరచుకున్న టబు బాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించింది. 42 ఏళ్లు దాటినా చెక్కు చేదరని అందంతో ఇంకా సినిమాలో గ్లామరస్ పాత్రలు చేస్తూ అందరిని షాక్ కు గురి చేస్తుంది.
తెలుగు, తమిళ, హింది భాషల్లో సినిమాలు చేసిన టబు నేషనల్ వైడ్ గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఒంటరి జీవితానికి అలవాటు పడ్డ ఆమె బాలీవుడ్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. కాని ఇప్పుడు ఓ సినిమా పరంగా టబు మళ్లి వారతల్లోకి ఎక్కింది. యస్..అందంగా..గ్లామరస్ రోల్ లో నటించే టబు..ఒక్కసారిగా గేర్ మార్చిన్నట్లు తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..టబు ఓ సినిమాలో విధవరాలుగా కనిపించనుందట.
పాత్రల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే టబు.. తాజాగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నిజానికి అప్పుడేప్పుడో 2000 సంవత్సరంలో మహేశ్ దర్శకత్వం వహించిన ‘అస్థిత్వ’లో లీడ్ రోల్ చేసింది టబు. ఈ సినిమా జాతీయ అవార్డును సాధించింది. అంటే దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహేశ్, టబు కలసి ఓ సినిమా చేస్తున్నారనమాట. ఈ సినిమాలో టబు విధవరాలుగా కనిపించనుంది. ఈ పాత్ర బోల్డ్ గా ఉండి సినిమాకి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటుందట. మరి చూడాలి టబు ఈ సినిమా తరువాత ఎలాంటి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో..??