Moviesవావ్: అనుకోని అతిథి..బాలకృష్ణ షాకింగ్ సర్ప్రైజ్..అదరగొట్టేసారుగా..!!

వావ్: అనుకోని అతిథి..బాలకృష్ణ షాకింగ్ సర్ప్రైజ్..అదరగొట్టేసారుగా..!!

టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోవాలో నైట్ ఎఫెక్ట్‌లో యాక్షన్ సన్నివేశాల కోసం భారీ సెట్‌ను ఏర్పాటు చేసి చిత్రీకరిస్తున్నారు తాజాగా ఈ సినిమా టీంకు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో బాలకృష్ణ “లైగర్” సెట్ ను సందర్శించారు. బాలయ్య సడెన్ గా అక్కడ కనిపించడంతో మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ సైతం షాక్ గురైయారు. ఆ తరువాత అనుకోని అతిథిలా వచ్చిన ఆయనతో మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందులో బాలయ్యతో పాటు విజయ్ దేవరకొండ, పూరీ, ఛార్మి ఉన్నారు.

 

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news