Moviesశేఖర్ కమ్ముల ఒక్క సినిమాకి ఎంత పారితోషకం తీసుకుంటాడో తెలుసా..?

శేఖర్ కమ్ముల ఒక్క సినిమాకి ఎంత పారితోషకం తీసుకుంటాడో తెలుసా..?

శేఖర్ కమ్ముల..టాలీవుడ్ ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు అంటూ సినీ ఇండస్ట్రీలో పిలుస్తుంటారు. శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అతడు తీసిన సినిమాలు చాల తక్కువ. ఆలస్యంగా వచ్చినా ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి.శేఖర్ కమ్ముల సినీ ఇండస్ట్రీ లో దశాబ్దం పైగానే కుటుంబ కథా చిత్రాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న ఏకైక డైరెక్టర్.

కాగా శేఖర్ క‌మ్ముల‌ సినీ కెరీర్ లో ‘గోదావరి’, ‘లైఫ్ ఈస్ బ్యూటిపుల్’, ‘హ్యాపి డేస్’, ‘ఫిదా’ వంటి ఎన్నో మంచి హిట్లు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరోతో కూడా శేఖర్ క‌మ్ముల‌ సినిమా చేయకపోవడం విచిత్రంగా కనిపిస్తుంది. నిజానికి పెద్ద హీరోలతో సినిమాలు తీయాలి అన్నది శేఖర్ కమ్ముల డ్రీమట. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేయాలని ఉంటుందట. కానీ ఆయన కథ చెప్తానంటే పెద్ద హీరోలెవరూ సమయం ఇవ్వరట. ఎందుకంటే ఆయన కథ చెప్తే వాళ్ళకి నీరసం వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శేఖర్ క‌మ్ముల‌ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరి రిలీజ్ కి రెడీగా ఉంది. త్వరలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఓ త్రిభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు

నిజానికి టాలీవుడ్ లో మిగతా డైరెక్టర్లతో కంపెర్ చేసుకుంటే ఈయన రెమ్యునరెషన్ చాలా తక్కువ, ఈయన ఒక్కో సినిమాకి 10 కోట్లు పారితోషకం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈయన కి ఆస్తులు కూడా పెద్దగా లేవు. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..సినీ ఇండస్ట్రీలో ఉండేఅవారందరూ బంజార హిల్స్..జూబ్లి హిల్స్ లో ఉండాలి అనుకుంటుంటే.. ఈయన మాత్రం హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో నివాసం ఉంటున్నాడు. మొదట నుండి శేఖర్ కి సింపుల్ గా ఉండటమే ఇష్టమట.

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news