MoviesDisney+HotStar: బ్రాండ్‌ అంబాసిడర్‌గా చరణ్ షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతో తెలిస్తే కళ్లు జిగేల్..?

Disney+HotStar: బ్రాండ్‌ అంబాసిడర్‌గా చరణ్ షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతో తెలిస్తే కళ్లు జిగేల్..?

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ ఫుల్ జోష గా వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో పనిచేస్తూ నటుడిగా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చరణ్. ఇలాంటి సమయంలో ఓటీటీలో అగ్రస్థానం సంపాదించుకొన్న డిస్నీ+హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఇకపై తెలుగులో డిస్నీ హాట్‌స్టార్‌ను రామ్‌ చరణ్‌ ప్రమోట్‌ చేయనున్నారు.

కరోనా తర్వాత ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు పరుగుపెడుతున్నాయి. డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులో రాబోతోంది. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల మెప్పు కోసం హాట్ స్టార్ .. స్టార్‌ హీరోల సినిమా హక్కులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అయితే డిస్నీ+హాట్ స్టార్‌ ఇస్తున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇమతకి రాంచరణ్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నందౌకు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా..?? ఏకంగా 20కోట్లు. ప్రతీ ఏడాది రాంచరణ్‌కు సుమారు రూ.20 కోట్ల మేర రెమ్యునరేషన్ చెల్లించే విధంగా కాంట్రాక్టు జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ..ఇండియాలో కంటెంట్‌కు దిక్సూచిలా డిస్నీ హాట్ స్టార్ నిలుస్తోంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో హాట్ స్టార్ ప్రవేశంతో టాలీవుడ్‌ మేకర్స్ తో పాటు నటీనటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news