సినీ ఇండస్ట్రీలో ఏదైన ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఇతర భాషలో రీమేక్ అవ్వడం సర్వసాధారణం. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలను ఎన్నో బాషల్లో రీమేక్ చేసారు. ఒక మంచి సినిమా ను ఒక భాష నుండి మరో భాష కి సంభందించిన ఆడియన్స్ కి అందించాలి కాబట్టి రీమేక్స్ విషయం లో ఎలాంటి తప్పు లేదు కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ విస్తారంగా వ్యాప్తి చెంది ఉన్న టైం లో అందరూ అన్ని భాషల సినిమాలను సబ్ టైటిల్స్ తో చూసేస్తూ సినిమా కి భాషతో సంభందం లేదు అని నిరూపిస్తున్న వేల ఇంకా రీమేక్‌లు చేయడం చాలా కష్టతరం అనే చెప్పాలి.
కానీ ఇప్పుడు ఒక్క సినిమా ఇండోనేషియా భాషలో రీమేక్ అవుతుండడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మరో రీమేక్ కు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిగా, మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ బాక్స్ ఆఫిస్ వద్ద ఎంత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఫస్ట్ టైం ఈ సినిమా అవుతుంది. ఈ సినిమా దృశ్యం ఇప్పటికే 4 భారతీయ భాషల్లో అలాగే 2 విదేశీ భాషలలో రీమేక్ అయిన విషయం తెలిసిందే.
విడుదలైన అన్ని భాషల్లోను ఈ సినిమా మచి పాజిటివ్ టాక్ ను సొతం చేసుకోవడమే కాదు..మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక్కడ ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటంటే.. చైనీస్ భాషలోకి రీమేక్ చేసిన మొదటి మలయాళ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. దాదాపు ‘దృశ్యం’ విడుదలైన ఎనిమిది సంవత్సరాల తరువాత ఇండోనేషియాలో రీమేక్ గా విడుదల కాబోతోంది. ‘దృశ్యం’ చిత్ర నిర్మాత ఆంథోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని ఇండోనేషియాలోకి అనువదిస్తున్నట్లు ప్రకటిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.