ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయారు. ఈ రోజు గుంటూరు జిల్లా లో దివంగత మాజీ మంత్రి, ఏపీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్థంతి సభలో పాల్గొన్న ఆయన వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కోడెలను చూసేందుకే విశాఖ నుంచి నరసారావుపేట వచ్చానని చెప్పిన అయ్యన్న.. కారులో వచ్చి దూరం నుంచే కోడెల మీటింగ్ విన్నానని గుర్తు చేసుకున్నారు. ఆయన మురుగుదొడ్ల నిర్మాణంతోనే జాతీయ స్థాయి అవార్డులు పొందారంటూ ప్రశంసలు గుప్పించారు.
కోడెలను చూసి నా నియోజకవర్గం లో స్మశానాలను అభివృద్ధి చేశానని… 1983 నుంచి టిడిపి కి కోడెల చేసిన సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. కోడెల కుటుంబానికి మేమంతా అండగా ఉంటామన్న అయ్యన్న చెత్త నా కొడుకులు ఈ రోజు రాష్టాన్ని పాలిస్తున్నారంటూ పరోక్షంగా వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా ? అని ఫైర్ అయ్యారు. చెత్త , మరుగు దొడ్లు పై పన్ను వేసే వాడిని చెత్త నా కొడుకు అనక ఏం అంటారని ప్రశ్నించారు.
పనికి మాలిన కొడుకులు పాలన చేస్తే ఇలానే ఉంటుందని.. తమపై ఎన్ని కేసులు పెడతారో ? ఏం పీక్కుంటారో ? పీక్కోండని ప్రశ్నించారు. ఇక గుంటూరు జిల్లాకే చెందిన హోం మంత్రిని చూస్తే జాలోస్తోందన్న ఆయన సన్న బియ్యం అంటే తెలియనోడు పౌరసరఫరాల శాఖా మంత్రిగా ఉంటే.. బెట్టింగ్ రాయుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని… కోడెల కూడా హోం మంత్రి చేశారని.. హోం మంత్రికి సిగ్గు లజ్జ ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జైలులో చిప్పకూడు తినే నా కొడుకును తీసుకు వచ్చి సీఎంను చేశారని.. సినిమా వాళ్ల బ్లాక్ టిక్కెట్లు కూడా సీఎం అమ్ముతాడా ? అని ఆయన ప్రశ్నించారు. ఇంటికి తిరిగి మల్లెపూలు కూడా అమ్ముకునే పనికి అంబటి రాంబాబును అధ్యక్షుడిని చేయండని.. అంబటి, అవంతి కి నిత్యం అమ్మాయి లు కావాలంటా ? అని ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఏదేమైనా అయ్యన్న ముఖ్యమంత్రిని, వైసీపీ మంత్రులు, నేతలను తీవ్రస్థాయి పదజాలంతో ఆడుకున్నారు.