రంగుల ప్రపంచం మాయలోకం ఇలా సినిమా పరిశ్రమకు ఎన్నో పేర్లు. ఇక్కడ నిలబడాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం ఉండాలి. లేకుంటే పత్తాలేకుండా పోతారు. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటేనే ఓ మాయలోకం. ఈ రంగుల ప్రపంచంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎవరిని పడేస్తుందో కూడా తెలియదు.
ఒకసారి హిట్ కొడితే పలకరించే అదే సినీ జనాలు ఫ్లోప్ వస్తే మాత్రం పట్టించుకోరు.. అప్పటిదాకా ఉన్న పరిస్థితి ఒకటైతే ఫ్లోప్ వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అందుకే మన సినిమా వాళ్ళు ఫ్లోప్ సినిమాకు దూరంగా ఉంటారు. హిట్టుతో ఎంత గుర్తింపు వస్తుందో ఫ్లాప్ తో అంతకంటే దారుణ స్థితి నెలకొంటుంది. అలాంటి లిస్ట్ లోకే వస్తారు హరీష్.
హరీష్ అతి తక్కువ సమయంలోనే బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని.. అటు బాలీవుడ్ తో పాటు మొత్తం ఐదు భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బాల నటుడిగా అప్పట్లోనే రికార్డు సృష్టించాడు. అంతేకాదు 1983 సంవత్సరంలో ఆంధ్రకేసరి సినిమాతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు హరీష్. సుమారు 280 చిత్రాల్లో నటించినప్పటికీ హీరోగా హరీష్ గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. తెలుగులో ప్రేమఖైదీ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన..ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు హరీష్. టాలెంట్ ఉన్న అదృష్టం కలిసిరాకపోవడంతో వరుస్ ఫ్లాప్ సినిమాలు కారణంగా కొత్త ఆఫర్స్ రాకపోవడంతో ఈయన సినీ కెరీర్ నాశనం అయ్యింది.