నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఈ తరం జనరేషన్లో తిరుగులేని స్టార్ హీరో. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత తారక్ కొరటాల… ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇక ఇవే కాకుండా ఇంకో మూడు సినిమాలు ఫైలైజ్ లిస్ట్ లో ఉన్నాయి ఈ లెక్కన చూసుకుంటే తారక్ 2023 వరకు కాల్ షీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అని తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయాలని ఇతర ఇండస్ట్రీలో కొంత మంది అగ్ర దర్శకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టు ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్వరలోనే సినిమా చేయనున్నారట. ‘అనురన్’ వంటి జాతీయ అవార్డు దక్కించుకున్న సినిమాను రూపొందించిన దర్శకుడు వెట్రిమారన్. తన సినిమాలు చాలా సహజంగా.. ఊర మాస్‌గా ఉంటాయి. తారక్ ని మాస్ లుక్ లో చూస్తే ఆయన అభిమానులకు పూనకాలే. తారక్ గురిచి ప్రత్యేకంగా చెప్పక్క్ర్లేదు..తనకు ఇచ్చిన పాత్రని తన నటనతో వేరే లెవల్‌కి తీసుకువెళ్తారు. అది రొమాంటిక్ అయినా, కామెడి అయినా, విలనిజం అయినా.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇలాంటి పాత్రలో అయినా ఆయన జీవిస్తారు. మరి అలాంటి నటుడు, వెట్రిమారన్ వంటి దర్శకుడి కాంబినేషన్లో సినిమా చేస్తే.. బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు.
గతంలో అట్లీ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన ఫోకస్ మొత్తం కొరటాల శివ ప్రాజెక్టు పైన పెట్టబోతున్నాడు. ఆ సినిమా కథ కూడా దాదాపు ఫినిష్ అయ్యింది. లాక్ డౌన్ లోనే దర్శకుడు కొరటాల ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి సినిమా ఎప్పుడైనా కూడా సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది.