పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. ఆ పేరు చెబుతుంటేనే ఆయన అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్..టాలీవుడ్ కి ఎన్నో భారి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. సినీ నటుడిగా పవన్ కల్యాణ్ స్టార్ డమ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. అందరికన్నా భిన్నంగా సాగిపోయే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే.. ఎవ్వరికైనా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.
ఇక కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ ..వకీల్ సాబ్ అనే చిత్రంతో మళ్లి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో చూయించాడు. ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఇక పవన్ కళ్యాన్ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..బిజీ గా మారిపోయాడు. ఆయన ఒప్పుకున్న సినిమాల లిస్ట్ చూస్తే ..ఇంకో 3-4 ఏళ్లు ఆయన కాల్ షీట్ దోరకడం కష్టమే అన్నట్లు తెలుస్తుంది. ఇక వరుస ఆఫర్లు క్యూ కడుతున్న సమయంలో..పవన్ తన పారితోషకాని కూడా పెంచేసాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిన్న మొన్నటి వరకు ఒక్కోకో సినిమాకి 50 కోట్లు మాత్రమే తీసుకున్న పవన్ ..ఇప్పుడు ఆ పారితోషకాని 60 కోట్లకు పెంచాడట. పోటీ ఎక్కువగా ఉండటంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ పెంచాడట. అంటే ఇక నుండి తనతో సినిమా తీయాలంటే 60 కోట్లు రెమ్యునరేషన్ గా ఇవ్వాలన్న మాట. ఇక పవన్ ఖాతలో’భీమ్లా నాయక్” , ”హరిహర వీరమల్లు” చిత్రాలు.. హరీష్ శంకర్ తో ” భవదీయుడు భగత్ సింగ్ ” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇక భీమ్లా నాయక్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయితే ఈ రేటు మళ్ళీ పెరగడం ఖాయం అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు.