నాగార్జున కెరీర్లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం గీతాంజలి. తెలుగు సినీ ప్రేక్షకులను బాగా కట్టిపడేసిన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన సినిమా గీతాంజలి . ఇక ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ సినిమా. మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం.
హీరోగా నాగార్జున, హీరోయిన్ గిరిజ నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా ఈ సినిమాతో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత హీరోయిన్ గిరిజకు మంచి అవకాశాలు వస్తాయని అందరూ అనుకుంటుండగానే ఆమె సడెన్గా మాయమైపోయింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు.
గిరిజ పూర్తి పేరు గిరిజ ఎమ్మా జేన్ షేత్తార్. తన 18 వ ఏటనే భరతనాట్యం నేర్చుకుంది.. ఇక ప్రముఖ క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలుతో కలిసి మణిరత్నం – సుహాసిని పెళ్లికి కూడా అటెండ్ అయింది. తన పెళ్లిలో చూసిన గిరిజను ఎలాగైనా సరే తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని డిసైడ్ అయిన మణిరత్నం , వెంటనే ఆమెను కలిసి తన సినిమాలో హీరోయిన్ గా చెయ్యమని కోరడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందట.
గిరిజ ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో ఈమె మలయాళం లో కూడా కొన్ని సినిమాలలో నటించి, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ప్రస్తుతం లండన్లో ఒక రచయితగా అక్కడే స్థిరపడిపోయింది.ఇక దాదాపు 2005 సంవత్సరం నుంచి ఆరోగ్య సంబంధాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జర్నలిస్టుగా పని చేస్తోంది.