యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌ను ఒక్క సారిగా టర్న్ చేసిన సినిమా సమరసింహారెడ్డి. బాలకృష్ణ – బి.గోపాల్ దర్శకత్వంలో 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులు అన్నింటిని తిరగరాసింది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. పరుచూరి బ్రదర్స్ రచన చేయగా.. మణిశర్మ సంగీతం అందించారు.
ఈ సినిమాలో బాలయ్య పక్కన అంజలా ఝవేరి – సిమ్రాన్ – సంఘవి ముగ్గురు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తెలుగు ఫస్ట్ టైం కంప్లీట్ ఫ్యాక్షన్ సినిమాగా సమరసింహా రెడ్డి తెరకెక్కింది. అయితే ఈ సినిమా ను ఓ హీరో మిస్ చేసుకోవడంతో అది బాలకృష్ణ దగ్గరకు వచ్చింది.
ఈ సినిమా ఫస్ట్ మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గరకి వెళ్ళింది, స్టోరీ విన్న ఆయన ఈ కథ నాకు సెట్ అవ్వదు. నా కంటే ఎక్కువ మాస్ ఇమేజ్ ఉన్న హీరో కి ఇవ్వండి అని చెప్పారట. చివరకు ఈ కథను బాలకృష్ణకు చెప్పగా ఆయన ఓకే చేశారు. చివరకు సినిమా బాలయ్య కెరీర్‌ను, టాలీవుడ్ రికార్డులను టర్న్ చేసి పడేసింది.