కందిరీగ.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా, హన్సిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఇది. ఇక ఇందులో వరల్డ్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందుతున్న సోనుసూద్ అలాగే అక్ష కీలక పాత్రలో నటించి మెప్పించారు. అయితే 2011 వ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి దాదాపుగా 10 సంవత్సరాల ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఏమాత్రం ఊహించని విధంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత “రామ రామ కృష్ణ కృష్ణ “, “గణేష్” వంటి వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ కు, ఈ సినిమా మంచి బ్యాక్ అప్ ను కూడా అందించింది. ఇకపోతే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూసి తెలుసుకుందాం..
నైజాంలో రూ.6.42 కోట్లు , సీడెడ్ రూ.2.97 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.1.42 కోట్లు , ఈస్ట్ గోదావరి రూ.1
03 కోట్లు , వెస్ట్ గోదావరి రూ.0.98 కోట్లు , గుంటూరు రూ.1.35 కోట్లు, కృష్ణా రూ.1.12 కోట్లు , నెల్లూరు రూ.0.57 కోట్లు , ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కలుపుకొని రూ.15.86 కోట్లు , ఇక వేధించేవాడు ట్రస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.77 కోట్లు , ఓవర్సీస్ రూ.0.61 కోట్లు , ప్రపంచవ్యాప్తంగా 18.2 4 కోట్లు షేర్ ను వసూల్ చేసింది.
ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు ఈ చిత్రం 8.84 కోట్ల రూపాయల లాభాలను అందించింది. ఇక రామ్ పోతినేని ఈ చిత్రంతో తన సినీ కెరీర్లో వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ , కొంచెం స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తనలో వున్న మాస్ లుక్ ను అభిమానులకు చూపించి ప్రేక్షకులను అబ్బుర పరిచాడు. ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు.