అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా ఎదిగి, ఆ తర్వాత స్పెషల్ సాంగ్ లో కనిపిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన యాక్టర్ సిల్క్ స్మిత. ఈమె తన అందంతో కుర్రకారు మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా తనదైన శైలిలో నటిస్తూ అందరికీ ఆదర్శంగా కూడా నిలిచింది. ఇటీవల సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ లో ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఆమెకు వ్యతిరేకంగా తీయడంతో, వీరిపై ప్రముఖ నిర్మాత, దర్శకుడైన తమ్మారెడ్డి మీడియా వారిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికీ సహాయం చేసేది అని, దర్శక నిర్మాతలు కష్టాల్లో ఉంటే వారి సినిమాలను ఉచితంగా చేయడానికి కూడా వెనుకాడేది కాదని ఆయన చెప్పారు.
సిల్క్ ఓ సినిమా లో డాన్స్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా చేయలేక వెనుతిరిగి ఇంటికి వెళ్లి పోయిందట.. అందుకు ఓ ఆసక్తికరమైన విషయమే ఉంది. తమిళ సినిమా అయిన క్లాసిక్ ఫిలిం గా గుర్తింపు పొందిన మూండ్రం పిరై.. ఈ సినిమాలో కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించడంతో, రీమేక్ గా తెలుగులో వసంత కోకిల అనే సినిమాగా తెరకెక్కించడం జరిగింది. తెలుగులో కూడా ఇది మంచి క్లాసిక్ సినిమాగా గుర్తింపు పొందింది.
ఈ సినిమాలో సిల్క్ స్మిత కీలక పాత్ర పోషించారు అయితే ఈ సినిమాను ఊటీలో లో చిత్రీకరించారు. ఇకపోతే మొదటిసారి ఊటీకి వెళ్లడం జరిగింది. ఇక అక్కడ చలికి చేతులు, కాళ్ళు గడ్డకట్టుకుపోయినట్టు అనిపించేదట. డిసెంబర్ నెలలో ఈ చిత్రంలో పాటలు షూటింగ్ జరుగుతుండడంతో, అందులో దర్శకుడు కూడా త్వరగా చేయాలని , ఉదయం ఆరు గంటలకి షూటింగ్ స్టార్ట్ చేసేవారట. ఒక వైపు తమిళం రాక, దర్శకుడితో ఇబ్బందులు పడలేక ,చలిలో ఉండలేక..వెనుతిరిగి పోవాలని అనుకుందట. అయితే ఏ రంగంలో వెళ్లాలన్న కూడా కష్టాలను ఎదుర్కొంటేనే జీవితం ఉంటుంది అనుకొని తిరిగి ఆమె షూటింగ్ వెళ్లి పట్టుదలతో డ్యాన్స్ చేసిందట.