కమలహాసన్ .. నట విశ్వకర్తగా గుర్తింపు తెచ్చుకొని భిన్న, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన భారతదేశ ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు కమల్ హాసన్. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ , పెళ్లి ఉన్నట్టుగానే కమల్ హాసన్ జీవితంలో కూడా ప్రేమ, రెండు పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. కమలహాసన్ మొదట్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో అప్పుడే స్టార్ హీరోయిన్ గా తన జీవితాన్ని మొదలు పెట్టిన ఆమె తో ప్రేమ వ్యవహారం నడిపాడు. అంతేకాదు వీరి ప్రేమకు గుర్తుగా ఒక సినిమా కథను కూడా తీశారు అంటే నమ్మశక్యం కాదు.. అయితే ఆమె ఎవరు.? ఆ సినిమా ఏంటి ..? అనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీవిద్య.. బాల్యంలో పాలు కూడా తాగడానికి లేని పరిస్థితులను ఎదుర్కొని, శ్రీవిద్య 13 సంవత్సరాలలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది .ఇక తన నటనతో, అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. దర్శక నిర్మాతలు కూడా ఈమె కోసం అప్పట్లో ప్రత్యేకంగా సినిమా కథలను కూడా రూపొందించేవారు. శ్రీవిద్యకు ఆమె తల్లి పెళ్లి చేయాలని నిశ్చయించుకొని, అమెరికా నుంచి ఒక సైంటిస్ట్ ను కూడా తీసుకు రావడం జరిగింది. శ్రీవిద్య కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో అతడు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు.
అయితే ఆమె కూడా అప్పటికే కమల్ హాసన్ తో ప్రేమలో మునిగితేలుతోంది. 2008వ సంవత్సరంలో వీరిద్దరి ప్రేమ కు నిదర్శనంగా తిరక్క కథ అనే ఒక సినిమాను కూడా తెరకెక్కించారు. అయితే తమిళంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, వీరి ప్రేమ ఎంత పవిత్రమో అన్నంతగా ఈ సినిమాలో చక్కగా చూపించారు. అయితే కమల్ హాసన్ సినీ ఇండస్ట్రీలో అప్పట్లో కొంతమందితో సరిగ్గా ప్రవర్తించక పోవడం, తరచూ శ్రీవిద్య తో గొడవలు పడటం, ఆయన ప్రవర్తన బాగోలేదని తెలుసుకుని శ్రీవిద్య అతనికి దూరం కావాల్సి వచ్చింది. అలా వీరిద్దరు విడిపోయారు.