Gossips‘సంభవామి’ యూఎస్ రైట్స్‌కి కళ్లుచెదిరే రేటు.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్

‘సంభవామి’ యూఎస్ రైట్స్‌కి కళ్లుచెదిరే రేటు.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్

Mahesh Babu’s 23rd film Sambhavami makers demanding huge price for USA rights but distributors are not interested to pay such amount.

యూఎస్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించిన తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే.. ఠక్కున మహేష్‌బాబు పేరు చెప్పేస్తారు. ఎందుకంటే.. ఇప్పటివరకు అతని ఆరు సినిమాలు అక్కడ 1 మిలియన్‌కి పైనే కలెక్ట్ చేశాయి. అందులో మూడు ఫ్లాప్ సినిమాలు ఉండడం గమనార్హం. అలాంటిది.. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న ‘సంభవామి’ మూవీ రైట్స్‌ని కొనుగోలు చేయడానికి ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ ముందుకు రావడం లేదు. అందుకు కారణం.. ఈ మూవీ మేకర్స్ భారీ రేటు డిమాండ్ చేయడమే.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకార.. ‘సంభవామి’ మూవీ మేకర్స్ నార్త్ అమెరికా రైట్స్‌కి అక్షరాల రూ.25 కోట్లు అడుగుతున్నారట. సెట్స్‌కి వెళ్ళినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై విపరీతమైన అంచనాలు నెలకొనడం, పైగా యూఎస్‌లో మహేష్‌కి మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో.. మేకర్స్ అంత అమౌంట్ ఫిక్స్ చేశారట. అంతమొత్తం కలెక్ట్ చేయగల సత్తా తమ చిత్రానికి ఉందన్న నమ్మకంతోనే వాళ్లు యూఎస్ రైట్స్‌కి 25 కోట్లు రేటు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే.. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అంత అమౌంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారట. తాము రూ. 15-17 కోట్ల మధ్య ఇవ్వగలమని, అంతకుమించి ఇవ్వలేమని చెబుతున్నారట. కానీ.. ప్రొడ్యూసర్స్ మాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని మొండికేసుకుని కూర్చున్నారట. మరి.. 25 కోట్లకు ఈ మూవీ రైట్స్‌ని ఏ బయ్యర్ తీసుకుంటాడో చూడాలి.

వాస్తవానికి.. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘శ్రీమంతుడు’ సినిమానే అక్కడ రూ. 19 కోట్లు గ్రాస్ రాబట్టింది. అందులో షేర్ రూ.14 కోట్లు. ఇప్పుడు ‘సంభవామి’ మేకర్స్ డిమాండ్ చేస్తున్న రూ.25 కోట్లు సమర్పించుకుంటే.. దాదాపు రూ.30 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హిట్ టాక్ వస్తే అది సాధ్యం అయ్యే ఛాన్స్ ఉంది కానీ.. ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం మొదటికే మోసం వచ్చేస్తుంది. ఆ భయంతోనే డిస్ట్రిబ్యూటర్స్ 25 కోట్లు ఇచ్చుకోలేక 15-17 కోట్ల మధ్య డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news