Moviesమళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్..ఫోటోస్ నెట్టింట వైరల్..!!

మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్..ఫోటోస్ నెట్టింట వైరల్..!!

ప్రకాష్ రాజ్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారు ఉండరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగిన నటులలో ముందు వరసలో ఉంటారు ప్రకాశ్‌రాజ్. ప్రకాష్ రాజ్ తన నటనతో, మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇక ప్రకాశ్ రాజ్ విలన్ గా కంటే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.

తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుని దోచుకున్న ఆ నటుడు. తండ్రి, ప్రేమికుడు, విలన్, స్నేహితుడు, తాత ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోతాడు.. తన నటనతో ఆ పాత్రకు జీవం పోస్తాడు. అతనే ప్రకాష్ రాజ్. విలక్షణ నటనతో సౌత్ ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. సినిమాల్లో తండ్రి పాత్రేనా..ప్రతినాయకుడి క్యారెక్టరైనా ముందుగా గుర్తొచ్చేది మాత్రం ప్రకాశ్ రాజే.

తెలుగులో యస్వీరంగారావు, సత్యనారాయణ, రావుగోపాలరావు, కోట శ్రీనివాస్ రావుల తర్వాత అంతటి క్రేజ్ సంపాదించిన వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్. సీరియల్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచమైన ప్రకాష్ రాజ్.. వరస ఆఫర్స్ తో విభిన్న పాత్రలతో.. దక్షిణాది భాషల్లో నటిస్తూ.. ఓ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను మళ్లీ పెళ్లి చేసుకున్నానని తెలియజేస్తూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రకాష్ రాజ్. తన కొడుకు వేదాంత్ కోరిక మేరకు తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. ఈ ముచ్చటనే ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఫొటోలు షేర్ చేయగా..ప్రస్తుతం ఆ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news