Gossipsగేర్ మార్చిన రష్మి-సుధీర్ జంట..ఈసారి సరికొత్తగా..??

గేర్ మార్చిన రష్మి-సుధీర్ జంట..ఈసారి సరికొత్తగా..??

రష్మి గౌతమ్.. సుడిగాలి సుధీర్ ఈ జంట గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై వీరిద్దరు చేసే సందడి మాములుగా ఉండదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నుండి పరిచయమయ్యారు రష్మీ, సుధీర్. రష్మీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక స్టార్ కమెడియన్ గా నిలిచి వెండితెరపై కూడా మెప్పించాడు సుడిగాలి సుధీర్. టెలివిజన్ లో వచ్చే షోలలో సుధీర్, రష్మి ఉంటే.. టీఆర్పీ రెటింగ్ దూసుకుపోతుంది.

జబర్దస్త్ యాంకర్ రష్మీ .. అదే షో లో కమెడియన్ సుధీర్ ల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆన్ స్క్రీన్ ఇద్దరి ఫెయిర్ సూపర్ హిట్జ. బర్దస్త్ నుంచి ఢీ షో వరకు ఇద్దరూ… టీమ్స్ హెడ్స్ గా ఉంటున్నారు. యాంకర్ రష్మీ , సుధీర్ ల జంట టీవీ షోలలో చేసే అల్లరి , హడావుడి మాములుగా ఉండదు. ఢీ ప్రోగ్రాములో కానీ ఇటు జబర్దస్త్ ప్రోగ్రాములో కానీ వీరిద్దరిని ఫోకస్ చేస్తూ పంచ్ లు పడుతూ ఉంటాయి. ఇక ఢీ ప్రోగ్రాములో కూడా రష్మీ ప్రేమ కోసం సుధీర్ తపన తెలిసిందే. ఆన్ స్క్రీన్ ఇంత చేస్తున్న మీరు ఆఫ్ స్క్రీన్ మాత్రం తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు.

అయితే వీరిద్దరికి ఉన్న క్రేజ్ ను వాడుకుంటూ… బుల్లి తెర మీద వీరి షో లను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. తాను ఎంత ఛీ కొడుతున్నా… రష్మీ లవ్ కోసం సుధీర్ తగ ప్రయత్నిస్తాడు. ఇదంతా షో లో భాగంగానే అని తెలిసినా… పదేపదే సుదీర్ రష్మీ ల లవ్ ట్రాక్ వారి ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సుధీర్ మరియు రష్మీలు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి రెఢీ అవుతున్నారనే న్యూస్ బయటకు వచ్చింది. జబర్దస్త్ లో నటించే నటీనటులతో ఒక చక్కని కాన్సెప్ట్ తో షార్ట్ ఫిల్మ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఫినిష్ అయిందని తెలుస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ ని సుధీర్ మరియు రేష్మీలు కలిసి నిర్మించనున్నారు అని టాక్ వినబడుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news