యంగ్ హీరో కార్తికేయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి..టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పేషల్ అట్రాక్షన్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ కు జంటగా పాయల్ రాజ్ పుత్ నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు.. అందరిని మనసులను గెలుచుకుంది.
ఇక ఆ తరువాత ఈ హీరో కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో భాగంగా హిప్పి , గుణ 369 , 90 ఎం ఎల్ సినిమాలో నటించాడు. కానీ వీటిలో ఏ ఒక్క సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కార్తికేయ నుంచి చివరగా వచ్చిన సినిమా ‘చావు కబురు చల్లగా’ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ హీరో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
ఇక ఈయన గుట్టుచప్పుడుకాకుండా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడంతో కార్తికేయ ఎంగేజ్మెంట్ మ్యాటర్ బయటపడింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది.
తమ కుటుంబానికి సన్నిహితులైన కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ఇష్టపడిన కార్తికేయ.. పెళ్లికి సిద్దమైనట్లు సమాచారం. పెద్దలు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్‌గా నిశ్చితార్థం ఫినిష్ చేశారట. కార్తికేయ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.