సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అదిలేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నేడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లందరూ వాట్సాప్ వాడటం మామూలైపోయింది. దీంతో వాట్సాప్ యూజర్ల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది.
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉందంటే వాట్సాప్ తప్పక వాడాల్సిందే. అంతగా ఈ యాప్ వినియోగదారుల జీవితాల్లో ఓ భాగం అయ్యింది. ఎందుకంటే వాట్సాప్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫైల్స్‌ను పంపించడం.. ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం మాత్రమే కాదు ఇప్పుడు పేమెంట్స్ చేయడం లాంటి పనులు కూడా వాట్సాప్ తో అయిపోతున్నాయి.
అయితే చాలా మంది వాట్సాప్‌లో గ్రూపులు మెయిన్‌టెన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసిన వాట్సాప్ నుండి కొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. వినియోగదారులకు అదిరిపోయే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దానితో మీరు పర్సనల్ చాట్స్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ లో మనం సీక్రెట్ గా ఉంచాలనుకున్న చాట్లను ఎప్పటికీ దాచి ఉంచే విధంగా, అవసరమైతే తిరిగి పొందగలిగే విధంగా దాచడానికి కొత్త ఆప్షన్ వచ్చేసింది.
దాచాలనుకుంటున్న ఏదైనా చాట్‌ని ఎక్కువసేపు నొక్కితే, ఆ చాట్ ఆర్కైవ్ బాక్స్‌ని చూపుతుంది. మీరు బాక్స్‌పై క్లిక్ చేసి మీ చాట్‌ను దాచవచ్చు. మీరు ఆర్కైవ్ చేసిన విభాగం కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు దాచిన అన్ని చాట్లను చూడగలరు. ఒకవేళ మీరు మీ చాట్ బాక్స్ పై భాగంలో చాట్ చూడాలనుకుంటే చాట్ మీద మళ్లీ ఎక్కువసేపు నొక్కి అదే ఆర్కైవ్ బాక్స్‌పై క్లిక్ చేయండి అంతే. ఒకవేళ చాట్లను శాశ్వతంగా దాచాలంటే..సెట్టింగ్స్ లో చాట్ అనే ఆప్షన్ కు వెళ్ళండి. ఆర్కైవ్ చాట్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే చాట్లు ఆర్కైవ్‌లోకి వెళ్తాయి. ఇది మీ చాట్లను ఆర్కైవ్ చేస్తుంది లేదా ఎప్పటికీ దాచి ఉంచుతుంది…అంతే..!!