నందమూరి తారకరామారావు..టాలీవుడ్ సినీ చరిత్రలో..అలాగే రాజకీయ చరిత్రలో ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? అనడంలో సందేహం లేదు. ముందు కథానాయకుడిగా.. ఆ తర్వాత మహానాయకుడిగా ఆయన జీవితం ఆదర్శప్రాయం. ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ .
మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే.అభిమాన జనానికి ఎన్టీఆర్ యుగపురుషుడు- కారణ జన్ముడు.అటు సినీ ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాలలోనూ ఎంతో క్రమబద్ధతగా చక్కగా నిర్వహించుకుంటూ వచ్చారు.
ఇక లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అప్పట్లో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఆహర విష్యంలో చాలా కేర్ తీసుకునేదట. ఇక నందమూరి తారకరామారావు దాదాపు 35 సంవత్సరాల పాటు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నప్పుడు.. ఆమె ఫుడ్ విషయంలో మరింత కఠినంగా ఉండేదట. ఎందుకంటే ఆయనకు మధుమేహం ఉండడంతో, తీపి ఎక్కువ ఉండకూడదని , కారం తగ్గించమని , నూనె ఎక్కువ ఉండకూడదని చాలా లైట్ ఫుడ్ పెట్టేదట.
అయితే ఒకానొక సమయంలో లక్ష్మీపార్వతి ఆహారంలో చాల మార్పులు, చేర్పులు చేయడంతో విసిగిపోయిన ఎంటీఆర్. “ఆమెకు వండడం తెలియదు.. తినడం తెలియదు..” అని కసిరారట.నిజానికి ఎన్టీఆర్ మంచిభోజనప్రియులు.. పుష్టిగా తింటారు..ఏ భోజనం అయిన సరే ఆస్వాదిస్తూ తినడం ఆయనకు అలవాటు..అలాంటి ఆయనకి లక్ష్మిపార్వతి ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టేసరికి నందమూరి తారకరామారావు భరించలేకపోయారట.