ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. మోస్ట్ బిజీఎస్ట్ స్టార్‌గా అందరిచేత పిలిపించుకుంటున్నారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ. పాన్ ఇండియా సినిమాల దగ్గర నుంచి పక్క ఇండస్ట్రీల డైరెక్టర్ల వరకు అన్నింటికి, అందరికీ ఫస్ట్ చాయిస్‌గా మారి అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియ మూవీ “పుష్ఫ” సినిమాలో నటిస్తున్న బన్నీ.. ఆ తరవాత వరుసగా డైరెక్టర్లను లైన్లో పెట్టి మరో 2 సంవత్సరాలు డేట్లు ఖాళీలేనంతగా బిజీగా మారిపోయారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఓ తమిళ రీమేక్ చిత్రంలో బన్నీ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని.. అది కూడా ఓ దేవుడి పాత్ర అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. గత ఏడాది తమిళంలో రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన “ఓ మై కడవులే” చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ అతిధి పాత్ర పోషించారు.
ఈ సినిమాలో ఆయన దేవుడిగా కనిపించారు. ఇక ఇదే సినిమాని ఇప్పుడు తెలుగులో యంగ్ హీరో విశ్వక్ సేన్.. హీరోగా తెరకెక్కిస్తున్నారు. అయితే తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన దేవుని పాత్రని తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషించబోతున్నట్లు టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు తెలుగులో ఆ పాత్రలో నటించడానికి వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ అంగీకరిస్తారో లేదో చూడాలి.