జూ.ఎన్టీఆర్.. నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు 1983 మే 20న హైదరాబాద్ మెహదీపట్నంలో పుట్టారన్న విషయం తెలిసిందే. తన నటన, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్.. ఇలా అన్ని విభాగాల్లో తనదైన మార్క్ చూపించిన జూ.ఎన్టీఆర్, టాలీవుడ్లోని అగ్రహీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. ఎన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
రామారావుకు మనవడు అయినప్పటికీ ఏ సందర్భంలోనూ ఎటువంటి అహం చూపించకుండా సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవం ఇస్తూ ఒక సామాన్యుడిలా కష్టపడి ప్రస్తుత స్థాయికి తారక్ చేరుకున్నారంటే… ఆ క్రెడిట్ అంతా తన తల్లి షాలిని కే దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటారా.. చిన్నప్పటి నుండే ఎన్టీఆర్ ని ఎంతో క్రమశిక్షణతో మంచి బుద్ధులు నేర్పుతూ పెంచారు షాలిని. తన కుమారుడు తారక్ కి ఏ లోటూ రాకుండా అతనికి తానే అన్నీ అయ్యి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు షాలిని. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని ప్రాణంగా చూసుకుంటారు.
అయితే నిజాని ఎన్టీఆర్ తల్లి షాలిని భయట పెద్దగా కనిపించారు చాల సైలెంట్. అప్పుడెప్పుడో యమదొంగ సినిమా ఫంక్షన్ కి విచ్చేసిన షాలిని కొంత సమయం పాటు ఉండి వెళ్లిపోయారని కొంత మంది చెబుతుంటారు. ఆ ఒక్క సినిమా ఫంక్షన్ లో తప్ప మరేతర కార్యక్రమాల్లో షాలిని పాల్గొనలేదు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరో అయినప్పటికీ… తన తల్లి మాత్రం గొప్పలకు పోరు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి ఎనలేని ప్రేమ ఆప్యాయత చూపిస్తూ ఆమె ఇప్పటికీ తల్లి బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ మూవీ RRRలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తెలుగులో తారక్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిగతా స్టార్ హీరోలతో పోటీ పడుతూ తన సత్తా చాటుతున్నాడు తారక్.